ETV Bharat / state

'బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పనిచేస్తాం'

author img

By

Published : Apr 4, 2023, 2:25 PM IST

cpi, cpm leaders comments on bjp party: తప్పుడు దారుల్లో అధికారం కోసం ఎత్తులు వేస్తున్న భాజపాను నిలువరించేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు తెలిపారు.

cpi, cpm leaders comments on bjp party
'బీజేపీ తప్పుడు పద్దతిలో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తుంది'

cpi, cpm leaders comments on bjp party: బీజేపీ తప్పుడు పద్దతిలో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి కట్టిగా పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై బీఆర్​ఎస్, కేసీఆర్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని మగ్ధుమ్ భవన్​లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

బీజేపీ ప్రమాదకర శక్తిగా తయారైందనీ.. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు. రాహుల్ గాంధీపై తీసుకున్న చర్యలను వెనక్కి తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐతో ప్రతిపక్షాలను కేంద్ర ప్రభుత్వం లొంగ తీసుకుంటుందనీ మండిపడ్డారు. మోదీ అక్రమాలు, మైనార్టీలపై జరుగుతున్న హత్యాకాండపై షర్మిల స్పందించడం లేదన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై పల్లెత్తు మాట అనడం లేదనీ.. షర్మిల నాటకాలు మానుకుంటే మంచిదనీ హితవు పలికారు.

ఏప్రిల్ 9న ఎగ్జిబిషన్ మైదానంలో సీపీఎం, సీపీఐ శ్రేణులతో సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇరు పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నుంచి మండలి స్థాయి నాయకులు హాజరవుతారనీ చెప్పారు. చట్ట సభల్లో అడుగుపెట్టడమే లక్ష్యంగా ఉభయ కమ్యునిస్టు పార్టీలు పని చేస్తున్నాయన్నారు. ప్రధాని విద్యా అర్హతల గురించి అడిగితే.. 25 వేల జరిమానా విధించడం ఏమిటనీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేనీ సాంబశివ రావు ప్రశ్నించారు. మోడీలను ప్రశ్నిస్తే అనర్హత వేటు, రెండేళ్ళ జైలు శిక్షా వేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలపై వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు. టీఎస్​పీఎస్సీ పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎంలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయనీ.. మాకు గెలిపించే, ఓడించే శక్తి ఉందన్నారు.

"రాష్ట్రంలో పేపరు లీకేజీలు పెద్ద ముఖ్యమైన సమస్యగా ముందుకొస్తోంది. మొదట ప్రభుత్వం ఇద్దరు వ్యక్తులతోనే ఈ తప్పంతా జరిగిందని చెప్పారు. కానీ మేము ఇద్దరం అని భావించటం లేదు. లోతైన కుంభకోణం ఇందులో ఉంది. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని అభిప్రాయం కలిగించడానికి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తే బాగుంటుందని ఉభయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాం. సీపీఐ, సీపీఎం పార్టీలు రాబోయే రాజకీయాల్లో కీలకమైన పాత్ర నిర్వహించాలని, మా బలాన్ని స్పష్టంగా పెంచుకునే కృషి మేము చేయగలమని మేము నమ్ముతున్నాం"_తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

ఇవీ చదవండి:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.