ETV Bharat / state

కోర్టు విచారణలు ఈ నెల 30వరకు నిలిపివేత

author img

By

Published : May 21, 2021, 9:27 PM IST

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తమ రోజూ వారీ కోర్టు విచారణలు ఈ నెల 30వరకు నిలిపివేసినట్లు పేర్కొంది. ఏమైన ఫిర్యాదులు ఉంటే ఈ-మెయిల్ ద్వరా పంపించవచ్చని సూచించింది.

state human rights court
మానవ హక్కుల కమిషన్ కోర్ట్

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వరకు లొక్డౌన్ పొడగింపు నిర్ణయ ప్రకారం... రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తమ రోజూ వారీ కోర్టు విచారణలు ఈ నెల 30వరకు నిలిపివేసినట్లు పేర్కొంది. ఇది వరకే ఈ లాక్ డౌన్ సమయంలో ఇన్ పర్సన్, 'పోస్ట్ ద్వారా స్వీకరించే కొత్త ఫిర్యాదుల ప్రక్రియకు అనుగుణంగా email (office-shrc@telangana.gov.in) సదుపాయం కల్పించింది.

లాక్ డౌన్ వల్ల కమిషన్ కు రాలేనివారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కమిషన్ కార్యదర్శి కోరారు. సందేహ నివృత్తి కొరకు 9963141253 / 9000264345 నెంబర్లకు పనివేళల్లో ఫోన్ చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: ఆంక్షలను కఠినంగా అమలు చేయాలి: సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.