ETV Bharat / state

ఏ రైతూ కరవు రావాలని కోరుకోడు - కర్ణాటక మంత్రి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 8:01 PM IST

Minister Shivanand Patil Comments On Farmers
KTR Fires On Karnataka Minister Shivanand Patil

KTR Fires On Karnataka Minister Shivanand Patil : రైతులపై కర్ణాటక మంత్రి శివానంద పాటిల్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రైతుల గురించి హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్న వీరు ఎలాంటి మంత్రులని ప్రశ్నించారు.

KTR Fires On Karnataka Minister Shivanand Patil : రైతులను ఉద్దేశించి కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తప్పు బట్టారు. రుణాలు మాఫీ అవుతాయని రైతులు కరవు రావాలని కోరుకుంటున్నారన్న శివానంద పాటిల్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. రైతుల గురించి హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్న వీరు, ఎలాంటి మంత్రులని ప్రశ్నించారు. ఏ రైతు కూడా కరవు రావాలని కోరుకోడన్న ఆయన, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కూడా వారు కోరుకునేది ప్రభుత్వం నుంచి సానుభూతి మాత్రమేనని పేర్కొన్నారు.

రైతుల గురించి హాస్యాస్పద ప్రకటనలు చేస్తున్న వీరు ఎలాంటి మంత్రులు? ఏ రైతు కూడా కరవు రావాలని కోరుకోడు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కూడా వారు కోరుకునేది ప్రభుత్వం నుంచి సానుభూతి మాత్రమే. - కేటీఆర్ ట్వీట్

  • What sort of Ministers are these? Making absolutely ludicrous statements about the farmers

    No Farmer will ever wish for Drought. Even in the worst of conditions, all they wish for is empathy from Government https://t.co/d34DUimZTn

    — KTR (@KTRBRS) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించేది లేదు: కేటీఆర్‌

Minister Shivanand Patil Comments On Farmers : కర్ణాటక (Karnataka) మంత్రి శివానంద పాటిల్‌ (Shivanand Patil) రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెళగావిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన రైతు రుణ మాఫీల గురించి ప్రస్తావించారు. తమ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసేందుకు రైతులు ఏటా కరవును కోరుకుంటున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం మంత్రి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదంగా మారాయి.

కాంగ్రెస్​ పార్టీ అబద్ధపు హామీల వల్లే బీఆర్​ఎస్​ ఓడిపోయింది - సిద్ధరామయ్యకు కేటీఆర్ కౌంటర్​

‘‘రైతులకు కరెంట్‌, నీరు ఉచితంగా లభిస్తున్నాయి. ఎంతో మంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో వ్యవసాయరంగ విస్తరణకు సహకారం అందించారు. అయితే ఏటా కరవు రావాలని రైతులు కోరుకుంటున్నారు. ఎందుకంటే దీని వల్ల ప్రభుత్వం వారి రుణాలను మాఫీ చేస్తుందని భావిస్తున్నారు. కానీ, మీరు అలా కోరుకోవడం సరికాదు’’ - కర్ణాటక మంత్రి శివానంద పాటిల్

BJP Fire on Shivanand Patil : రైతులను అవహేళన చేస్తూ శివానంద మాట్లాడడంపై ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షపార్టీలు మండిపడుతున్నాయి. పాటిల్‌ను మంత్రి వర్గం నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య కేబినెట్‌ అంతా అజ్ఞానులతో నిండిపోయిందని బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను అవమానించిందని, ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమని దుయ్యబట్టింది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది.

లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి - పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం

బీఆర్ఎస్​ స్వేదపత్రం విడుదల కార్యక్రమం రేపటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.