ETV Bharat / state

'అంతర్జాతీయ నేత రాహుల్.. కానీ తన సొంత నియోజకవర్గంలో గెలవలేదు'

author img

By

Published : Nov 1, 2022, 12:32 PM IST

KTR counter to Rahul Gandhi
KTR counter to Rahul Gandhi

KTR Counter To Rahul Gandhi: మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా రాహుల్​ గాంధీపై తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ లక్ష్యాలపై రాహుల్ స్పందించిన తీరు హాస్యాస్పందంగా ఉందని ఆరోపించారు. అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అంటూనే.. కనీసం తన సొంత నియోజకవర్గం అమేథీలో గెలవలేకపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

KTR Counter To Rahul Gandhi: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ లక్ష్యాలపై రాహుల్ గాంధీ స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందని మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. రాహుల్ గాంధీకి ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చిన మంత్రి... అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ కనీసం తన సొంత నియోజకవర్గం అమేథీలో గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. అటువంటి వ్యక్తి సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రధాని కావాలనుకునే వారు ముందు.. ఎంపీ అయ్యేలా తమ ప్రజల్లో నమ్మకం కలిగించుకోవాలని రాహుల్​కు కేటీఆర్ సూచించారు.

అసలేం జరిగిదంటే: నిన్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా.. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస విధానాలను ఎండగట్టారు. భాజపా, తెరాస రెండు పార్టీలూ ఒకే విధానాన్ని అవలంభిస్తున్నాయని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్‌పైనా రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొంతమంది ఎవరికి వారే తమది పెద్ద పార్టీగా ఊహించుకుంటున్నారని.. అంతర్జాతీయ పార్టీగా ప్రకటించుకొని అమెరికా, చైనాలోనూ పోటీ చేయవచ్చని రాహుల్ ఎద్దేవా చేశారు.

  • International leader Rahul Gandhi who can’t even win his own parliament seat in Amethi ridicules Telangana CM KCR Ji’s national party ambitions 🤦‍♂️

    Wannabe PM should first convince his people to elect him as an MP

    — KTR (@KTRTRS) November 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: 'తెరాసతో పొత్తు ప్రసక్తే లేదు.. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ మోదీ నాశనం చేశారు'

Bharat Jodo Yatra in Hyderabad: కట్టుదిట్టమైన భద్రత నడుమ భారత్ జోడో యాత్ర

నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన హనుమంతుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.