ETV Bharat / state

Hyderabad Roads Empty During Dussehra Festival : పల్లెకు పోయిన పట్టణ వాసులు.. ఖాళీగా మారిన భాగ్యనగరం రోడ్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 10:07 PM IST

Dussehra Festival 2023
Hyderabad Roads Empty During Dussehra Festival

Hyderabad Roads Empty During Dussehra Festival : దసరా వేళ పల్లెకు పోయిన పట్టణం.. హైదరాబాద్ రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలకు ప్రభుత్వం దసరా, బతుకమ్మల సెలవులు ప్రకటించడంతో.. ఈ ఏడాది భారీగా జనం పల్లెలకు క్యూ కట్టారు. అధిక శాతం కుటుంబాలు నగరం నుంచి ఆంధ్రప్రదేశ్‌ తరలివెళ్లారు. కొంతమంది తెలంగాణలో తమ కుటుంబసభ్యులతో గడిపేందుకు స్వగ్రామాలకు తరలి వెళ్లారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే జంట నగరాల్లో ప్రధాన ప్రాంతాలన్నీ బోసిపోయినట్లు కనిపిస్తున్నాయి.

Hyderabad Roads Empty During Dussehra Festival : ఎప్పుడు బిజీ బిజీగా ఉండే భాగ్యనగర రోడ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ట్రాఫిక్​ లేకపోవడంతో.. ట్రాఫిక్​ కానిస్టేబుళ్లకు అసలు పెద్దగా పని లేకుండా పోయింది. హైదరాబాద్​ నగరమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. దసరా సెలవు(Dussehra Festival Holidays)ల కోసం ఉత్సాహంగా గడిపేందుకు పట్టణం వాసులంతా పల్లెలకు క్యూ కట్టారు. ఏడాది పాటు కన్నవారికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే వాళ్లంతా పెద్ద పండగను అందరితో కలసి జరుపుకునేందుకు తరలివెళ్లారు. సాధారణంగా దసరా, నవరాత్రి పండుగ అంటేనే హైదరాబాద్​ నగరం అంతా ఖాళీ అయిపోతుంది.

Hyderabad Roads Empty During Dussehra Festival దసరా వేళ పల్లెకు పోయిన పట్టణ వాసులు.. ఖాళీగా దర్శనం ఇస్తున్న భాగ్యనగరం రోడ్లు

దసరా సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు(Dussehra Festival Celebrations 2023) ప్రకటించడంతో అధిక శాతం కుటుంబాలు ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలలో తమ స్వస్థలాలకు తరలి వెళుతున్నారు. దీనికి తోడు శనివారం, ఆదివారం, సోమవారం తోడు కావడంతో ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు కలిసొచ్చింది. అందుకు ఈ ఏడాది భారీగా జనం పల్లెలకు క్యూ కట్టారు. విశ్వనగరం హైదరాబాద్​లో నిత్యం అత్యంత రద్దీగా ఉండే హయత్​ నగర్​, ఎల్​బీ నగర్​, చైతన్యపురి, సరూర్​నగర్​, మలక్​పేట, కోఠి, నెక్లెస్​రోడ్డు, నాంపల్లి, అమీర్​పేట, బేగంపేట, దిల్​సుఖ్​నగర్​, కూకట్​పల్లి, హైటెక్​సిటీ, మాదాపూర్​, గచ్చిబౌలి, లింగంపల్లి, మియాపూర్​, అబీడ్స్​, శాసనసభ, సచివాలయం, బషీర్​బాగ్​, అంబర్​పేట, ఉప్పల్​ తదితర ప్రాంతాలన్నీ వాహనాలు, ప్రజలు లేక బోసిపోయాయి.

Dussehra Special Home Foods : పండుగల వేళ.. 'హోమ్ ఫుడ్స్​'కు నగరవాసుల ఫిదా.. గారెలు, అరిసెలు, కారప్పూసలు.. పిండి వంటలేవైనా..!

Dussehra Festival Celebrations 2023 : జనాల రద్దీ కాకుండా వాహనాల రాకపోకలు సైతం భారీగా తగ్గిపోవడంతో ప్రశాంత వాతావరణం నడుమ రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దాంతో ఎప్పుడు ట్రాఫిక్​ జామ్​లతో కిక్కిరిసి పోయి కనిపించే హైదరాబాద్​ నగరం సాధారణానికి భిన్నంగా ఈ మూడు నాలుగు రోజులు కనిపిస్తుంది. నగర రోడ్లు పూర్తి నిర్మాణుష్యంగా మారాయి. ప్రధాన రోడ్లపై జనం అలికిడి కనిపించడం లేదు. వాహనాల శబ్ద కాలుష్యం కూడా అస్సలు లేదని జంట నగర వాసులు తెలిపారు.

సాధారణంగా ఏ పండుగ వచ్చినా సరే హైదరాబాద్​ నుంచి ఆంధ్రప్రదేశ్​తో పాటు నల్గొండ, ఖమ్మం జిల్లాలకు హైదరాబాదీలు క్యూ కడుతుంటారు. ప్రస్తుతం వాహనాల తాకిడి హైదరాబాద్​-విజయవాడ ప్రధాన రహదారిపై పెరిగింది. ఈసారి, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఇసుక వేస్తే రాలనంత మంది ఉండడంతో ప్రత్యక్ష నరకానికి ప్రయాణికులు గురయ్యారు. ఇక విమానాల ధరలు ఆకాశాన్ని తాకాయి. సొంత వాహనాల్లో బయలుదేరిన వారికి టోల్​ గేట్ల, ట్రాఫిక్​ జామ్​లు మరో రకమైన హింస చవిచూపించాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఈజీ ట్రాఫిక్​ ఫ్లో ఉండేలా అదనపు సిబ్బందిని మోహరించడం విశేషం.

Dussehra Festival celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. దుర్గామాత ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Dussehra Festival Celebrations at Pragati Bhavan : ప్రగతి భవన్​లో ఘనంగా దసరా వేడుకలు.. కుటుంబ సమేతంగా పాల్గొన్న సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.