ETV Bharat / state

భాగ్యనగరంలో వర్షం.. భారీగా ట్రాఫిక్​ జాం

author img

By

Published : Oct 9, 2020, 6:39 PM IST

Updated : Oct 9, 2020, 7:05 PM IST

హైదరాబాద్‌ నగరంలో అల్పపీడన ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కోఠి, ఏంజె మార్కెట్, అబిడ్స్, నాంపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచి పెద్దఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.

heavy-rain-in-hyderabad-cause-traffic-jam
భాగ్యనగరంలో వర్షం.. భారీగా ట్రాఫిక్​ జాం

భాగ్యనగరంలో వర్షం.. భారీగా ట్రాఫిక్​ జాం

అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. వానకు నగర రోడ్లు చెరువులను తలపించాయి. నిత్యం రద్దీగా ఉండే కోఠి, ఏంజె మార్కెట్, అబిడ్స్, నాంపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై మోకాళ్ల లోతు నిలిచిపోయింది.

సాయంత్రం సమయంలో విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్​ఎంసీ సిబ్బంది మ్యాన్ హొల్స్ ను తెరిచారు.

అమీర్‌ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, ప్యారడైజ్‌, సికింద్రాబాద్‌, హిమాయత్‌ నగర్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లోనూ చిరు జల్లులు కురిశాయి.

ఇదీ చూడండి : రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

Last Updated :Oct 9, 2020, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.