ETV Bharat / state

ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతోన్న ప్రక్షాళన - ఈసారి జీహెచ్​ఎంసీ అధికారులపై బదిలీ వేటు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 8:37 AM IST

Greater Hyderabad Metropolitan Municipality Commissioners Transfer : గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో అధికారులపై బదిలీ వేటు పడింది. కూకట్​పల్లి జోనల్ కమిషనర్​గా ఉన్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి.మమతను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో ఐఏఎస్ అధికారి అభిలాష అభినవ్​ను నియమించింది. అలాగే శేరలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి స్నేహ శబరీశ్​కు బాధ్యతలు అప్పగించింది. వీరితోపాటు మరికొంత మంది డిప్యూటీ కమిషనర్లను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

GHMC Commissioners Transfers
Greater Hyderabad Metropolitan Municipality Commissioners Transfe

Greater Hyderabad Metropolitan Municipality Commissioners Transfer : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(congress Government) కొలువు దీరాక అధికారుల బదిలీలపై ప్రధానంగా దృష్టి సారించింది. అన్ని ప్రభుత్వశాఖల్లో అధికారులను బదిలీ చేస్తూ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీపై(GHMC) కూడా దృష్టి సారించిన ప్రభుత్వం ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కూకట్ పల్లి జోనల్ కమిషనర్​గా ఉన్న వి. మమతను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్ మెంట్​కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలిగా ఉన్న మమత 2010 నుంచి జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్​గా 2010 నుంచి 2018 వరకు పనిచేశారు.

జీహెచ్​ఎంసీలో నిధుల కొరత - బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేసిన గుత్తేదారులు

Transfer Orders Issued Commissioners : 2018 నుంచి కూకట్ పల్లి జోనల్ కమిషర్​గా కొనసాగుతున్నారు. మమత కొనసాగింపుపై తరచు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆమెపై బదిలీ వేటు పడింది. మమత స్థానంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్​గా ప్రభుత్వం ఐఏఎస్ అధికారిని నియమించింది. అభిలాష అభినవ్​కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిపై కూడా బదిలీ వేటు పడింది. జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్ పై ఉన్న ఆయనను చేనేత, జౌళి శాఖ అదనపు డైరెక్టర్ గా యథాస్థానంలో కొనసాగాలని ఆదేశిస్తూ డిప్యూటేషన్ ను రద్దు చేసింది. శ్రీనివాసరెడ్డి స్థానంలో కూడా ఐఏఎస్ అధికారిని జోనల్ కమిషనర్ గా నియమించింది.

Transfer Orders Issued IAS and IPS Officers in Telangana : రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ

GHMC Commissioners Transfers : స్నేహ శబరీశ్​కు శేరిలింగంపల్లి బాధ్యతలను అప్పగించింది. అలాగే జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ వెంకటరమణను మూసీ నది అభివృద్ధి సంస్థ ఎస్ఈ గా బదిలీ చేసింది. మూసీ నది అభివృద్ధి సంస్థ ఎస్ఈ గా ఉన్న మల్లిఖార్జునుడు ఈఎన్ సీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పలువురు డిప్యూటీ కమిషనర్లను కూడా బదిలీ చేస్తూ కమిషనర్ రోనాల్డ్ రాస్(Commissioner Ronald Ross) ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఫలక్ నుమా డిప్యూటీ కమిషనర్​గా వై.శ్రీనివాస్ రెడ్డి, కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్​గా వి.నర్సింహ, సంతోష్ నగర్ డిప్యూటీ కమిషనర్​గా ఎ.నాగమణి, చార్మినార్ డిప్యూటీ కమిషనర్​గా ఎల్.సరిత ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వశాఖల్లో ప్రక్షాళన : అలాగే చార్మినార్ డిప్యూటీ కమిషనర్ ఢాకు నాయక్​ను కమిషనర్​కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఫలక్ నుమా అసిస్టెంట్ కమిషనర్​గా డి. లావణ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. జీహెచ్ఎంసీలో సుదీర్ఘ కాలంగా ఒకే హోదాలో ఉన్న అధికారుల బదిలీలపై దృష్టి సారించిన ప్రభుత్వం మరికొంత మంది ఉన్నత స్థాయి అధికారులను కూడా మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

నకిలీ జనన ధ్రువపత్రాలపై విజిలెన్స్ విచారణ... సీబీఐ దర్యాప్తునకు రాజాసింగ్ డిమాండ్

అగ్నిప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్​గా.. సికింద్రాబాద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.