ETV Bharat / state

PRC Discussions : హెచ్‌ఆర్‌ఏపై ప్రభుత్వ ప్రతిపాదనలు.. ఉద్యోగ సంఘాలతో కొనసాగుతున్న చర్చలు

author img

By

Published : Feb 4, 2022, 10:29 PM IST

PRC Discussions
PRC Discussions

prc discussions: ఏపీలో శనివారం నుంచి ఉద్యోగుల సహాయ నిరాకరణ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ అత్యవసర చర్చలు చేపట్టింది.

prc discussions : ఏపీలో రేపటి నుంచి ఉద్యోగుల సహాయ నిరాకరణ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ అత్యవసర చర్చలు చేపట్టింది. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రులు బొత్స, బుగ్గన, పేర్ని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థికశాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. చలో విజయవాడ సక్సెస్‌ కావడంతో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.

ఈ నేపథ్యంలోనే అత్యవసరంగా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు తాము చెప్పాల్సింది చెప్పామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. కార్యాచరణ ప్రకటించినందున ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదని తెలిపాయి. తమకు లిఖితపూర్వక హామీ కావాలని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. సమస్యపై సీఎం ఆలోచిస్తున్నారని స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రులు వివరించారు.

హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లలో మార్పులకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. అదనపు క్వాంటం పింఛన్‌ తదితర అంశాల్లో మార్పులు చేసేందుకు మంత్రులు అంగీకారం తెలిపారు. సీపీఎస్ రద్దుపై మరో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోందని.... చర్చల దృష్ట్యా సమయం కావాలని మంత్రుల కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులను కోరింది. ప్రభుత్వం సూచించిన అంశాలపై నిర్ణయం తెలపాలని ఉద్యోగ సంఘాల నేతలును కోరారు. చర్చించుకుని నిర్ణయం చెబుతాని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంతర్గతంగా చర్చించుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ చర్చలకు కాసేపు విరామం ఇచ్చింది. అయితే కొద్దిసేపటి తరువాత.. మళ్లీ చర్చలు మొదలయ్యాయి.

హెచ్‌ఆర్‌ఏపై ప్రభుత్వ ప్రతిపాదనలు ఇలా ..

  • 2 లక్షల వరకు జనాభా ఉంటే 8 శాతం
  • 2-5 లక్షల జనాభా ఉంటే 12 శాతం
  • 5-15 లక్షల జనాభా ఉంటే 16 శాతం
  • 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 24 శాతం
  • అదనపు క్వాంటం పింఛన్‌లో 70 ఏళ్లవారికి 5 శాతం
  • అదనపు క్వాంటం పింఛన్‌లో 75 ఏళ్లవారికి 10శాతం

అంతకుముందు ముఖ్యమంత్రి జగన్​ను కలిసిన మంత్రులు పరిస్థితిని వివరించారు. సమ్మె జరిగితే ప్రభావం తీవ్రంగా ఉంటుందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగులతో మాట్లాడి సమ్మె విరమింపజేయాలని సీఎం మంత్రులకు సూచించారు.

ఇదీ చూడండి: APSRTC Employees Strike: ఆర్టీసీలో సమ్మె సైరన్.. రేపు, ఎల్లుండి డిపోల్లో నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.