ETV Bharat / state

రైల్వేస్టేషన్లలో రూ.5.53 కోట్ల విలువైన బంగారం పట్టివేత

author img

By

Published : Mar 11, 2023, 11:09 AM IST

GOLD SMOGGLING
GOLD SMOGGLING

Smuggling Of Gold Worth RS.5.50 Crores In Railway Station In Telugu States: బంగారం స్మగ్లర్లు​ అక్రమంగా తరలింపు విషయంలో కొత్తమార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే తాజాగా సికింద్రాబాద్​, ఏపీలోని శ్రీకాకుళం రైల్వేస్టేషన్లలో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.5.50కోట్లు ఉంటుందని ఇంటెలిజెన్స్​ వర్గాలు తెలుపుతున్నాయి.

Smuggling Of Gold Worth RS.5.50 Crores In Railway Station In Telugu States: నిత్యం దేశ నలుమూల ఏదో ఒక విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్​ చేస్తూ పట్టుబడిన వ్యక్తులను చూస్తున్నాము. వారు అధికారుల కళ్లు కప్పి బంగారాన్ని తరలించేందుకు.. బంగారాన్ని పేస్ట్​ రూపంలో మార్చిన, ఇస్ట్రీ పెట్టె రూపంలో, లోదుస్తుల్లో పెట్టడం వంటి వివిధ మార్గాలలో తరలించేవారు. ఇంత టెక్నాలజీ ఉన్నా ఈ రోజుల్లో బంగారం స్మగ్లింగ్​ విషయంలో మాత్రం గెలవలేకపోతున్నారు.

ఈ తరహా స్మగ్లింగ్​ కేసులను ఎక్కువగా శంషాబాద్​ విమానాశ్రయంలోనే ఎక్కువగా చూస్తున్నాము. అయితే స్మగ్లర్​లు రోజుకో టెక్నాలజీతో.. కొత్త దారులను వెతుక్కుంటూ కొత్త పుంతలను తొక్కుతున్నారు. విమాన మార్గాలకే పరిమితమైన బంగారం స్మగ్లర్​లు.. ఇప్పుడు కొత్త దారులను కనుగొన్నారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశాలను టార్గెట్​గా చేసుకుంటూ వారి కార్యకలాపాలను సాగిస్తున్నారు. అయితే తాజాగా​ రైల్వేలను ఎంచుకుంటూ వారి కార్యకలాపాలను సాగించాలనుకున్నారు. తాజాగా పట్టుబడిన రెండు బంగారం స్మగ్లింగ్​ కేసుల్లో పెద్ద మొత్తంలో బంగారాన్ని డైరెక్టరేట్​ ఆఫ్​ ఇంటెలిజెన్స్​ రెవెన్యూ వారు పట్టుకున్నారు.

Rs.5 Crore Worth Of Gold Seized From Railway Station: ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​లో స్మగ్లర్​లు తరలిస్తున్న బంగారాన్ని డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్​ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని సిబ్బంది గమనించారు. అతని బ్యాగ్​లో నుంచి 2.314 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ సుమారు రూ.1.32 కోట్లుగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అతను కోల్​కత్తాకు చెందిన స్మగ్లర్​గా గుర్తించి.. అతనిని అరెస్ట్​ చేశామని డీఆర్​ఐ అధికారులు తెలిపారు.

అయితే మరో కేసులో 7.396 కేజీల బంగారం లభ్యమయ్యిందని డీఆర్​ఐ అధికారులు తెలిపారు. ఈ నెల 9వ తేదీన కోల్​కతా నుంచి వస్తున్న హౌరా ఎక్స్​ప్రెస్​లో ఏపీలోని శ్రీకాకుళం రైల్వేస్టేషన్​కు వచ్చిన వ్యక్తితో పాటు రైల్వే ప్లాట్​ఫారమ్​పైకి వచ్చిన ఆ వ్యక్తిని కలుసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారితో తీసుకొని వచ్చిన ట్రాలీ బ్యాగ్​ లోపల జిప్​ లైనింగ్ జేబులో 7.396 కేజీల 24 క్యారెట్లు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 8 బార్ల అనగా సుమారు రూ.4.21కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే అరెస్ట్ చేసిన నిందితులను ప్రశ్నించగా.. బంగ్లాదేశ్​ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్​ చేసి కోల్​కతాలోని బార్​లలో కరిగించి ఇలా తరలిస్తున్నట్లు వెల్లడించారు. వారి ఇద్దరినీ అధికారులు జ్యూడిషియల్​ కస్టడీకి తరలించారు. ఈ విషయంలో అధికారులు లోతుగా విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.