ETV Bharat / state

Ganja Gang Arrested : కారు నంబరు ప్లేటు మారుస్తూ.. గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్టు

author img

By

Published : Jul 5, 2023, 12:01 PM IST

Ganja
Ganja

Ganja Gang Arrested In Hyderabad : పోలీసులకు చిక్కకుండా వాహన రిజిస్ట్రేషన్‌ నెంబరు ప్లేటు మారుస్తూ గంజాయి రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర ముఠా ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులకు చిక్కింది. సరుకు తీసుకెళ్లే సమయంలో పోలీసుల్ని ఏమార్చేందుకు తరచూ కారు నెంబరు ప్లేటు మారుస్తూ ప్రయాణిస్తోన్న గ్యాంగ్‌లోని ఆరుగుర్ని మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 200 కిలోల గంజాయి, రెండు కార్లు, ఆరు ఫోన్లు, రెండు నకిలీ నెంబరు ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

కారు నంబరు ప్లేటు మారుస్తూ.. గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్టు

Police caught Ganja Gang in Hyderabad : రాష్ట్రంలో భారీగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. పోలీసులకు చిక్కకుండా వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు ప్లేటును మారుస్తూ.. గంజాయి రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకొని.. అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్‌లోని ఆరుగురు నిందితుల నుంచి 200 కిలోల గంజాయి, రెండు కార్లు, ఆరు ఫోన్లు, రెండు నకిలీ నంబరు ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాచకొండ సీపీ చౌహాన్‌ వెల్లడించారు.

పుణె, షోలాపూర్‌కు చెందిన ఓ ముఠా.. చిన్నతనం నుంచే చెడు వ్యసనాలు, గంజాయికి బానిసైందని రాచకొండ సీపీ డీసీ చౌహాన్‌ తెలిపారు. మహారాష్ట్రలో గంజాయికి డిమాండ్‌ ఉందని గ్రహించే.. వీరంతా సిండికేట్‌గా ఏర్పడి కమీషన్ల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు నుంచి గంజాయి తరలించేవారని పేర్కొన్నారు. సీలేరులో స్మగ్లరు కేశవ్‌ వద్ద కిలో రూ.2000 లేదా రూ.3000లకు కొని మహారాష్ట్రలోని దత్తా అనే వ్యక్తికి రూ.20,000 చొప్పున అమ్ముతుండేవారని వివరించారు.

పోలీసులకు వాహన నంబర్లు చిక్కకుండా.. నిందితులు తాము ప్రయాణించే కారు నంబరును తరచూ మార్చేవారని సీపీ చౌహాన్‌ వెల్లడించారు. ఇటీవల దత్తా ఆర్డర్‌ చేయడంతో సీలేరు నుంచి 200 కిలోల గంజాయి తరలించారని తెలిపారు. ఇలా ఏపీ నుంచి గంజాయిని తరలిస్తూ.. తెలంగాణ బోర్డర్‌లోని ప్రవేశించారని.. అయితే ఇక్కడే వారికి ఇక్కట్లు ప్రారంభమయ్యాయన్నారు.

"వెనుకన ఉన్న సీటును పూర్తిగా తీసేసి.. ఆ మధ్యలో గంజాయి దాచి పెట్టి రవాణా చేయడం జరిగింది. 200 కిలోమీటర్లకు లేదా రెండు గంటలకు ఒకసారి నంబర్‌ ప్లేట్‌ను మార్చుకుంటూ తీసుకువస్తున్నారు. రెగ్యులర్‌ నంబర్‌ ప్లేట్‌.. నార్మల్‌ నంబర్‌ ప్లేట్‌ ఏవిధంగా ఉంటుందో పోలీసులకు స్పష్టంగా తెలుసు." - డీఎస్‌ చౌహన్‌, రాచకొండ సీపీ

Gang Caught By Police Transporting 200 KG Of Ganja : గతంలో ఇలా రెండుసార్లు సీలేరు నుంచి హైదరాబాద్‌ మీదగా మహారాష్ట్రకు గంజాయిని తరలించారని సీపీ చౌహాన్‌ చెప్పారు. అప్పుడు కూడా పోలీసులకు దొరకకుండా బాగానే తప్పించుకున్నారన్నారు. కానీ ఇప్పుడు ఆరుగురు వ్యక్తులు రెండు కార్లలో 200 కిలోల గంజాయితో సీలేరు నుంచి బయలుదేరి.. అనుమానం వచ్చినప్పుడల్లా ప్రతీ గంటకు నంబరు ప్లేటును మార్చేవారని వివరాలు తెలిపారు. నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ.. గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలను తనిఖీ చేశారు. అందులో 200కిలోల గంజాయి, నకిలీ నంబరు ప్లేట్లు లభ్యమయ్యాయి. వెంటనే ఆ కారులోని ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.