ETV Bharat / state

Famous Homeopathic Dr Sohan Singh Passed Away : 'హోమియో కింగ్​' ఇక లేరు.. గుండెపోటుతో డాక్టర్ సోహన్​సింగ్ కన్నుమూత

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 9:40 AM IST

Famous Homeopathic Dr Sohan Singh
Famous Homeopathic Dr Sohan Singh Passes Away

Famous Homeopathic Dr Sohan Singh Passed Away in Hyderabad : ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్​ సోహన్​సింగ్​ శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఎన్నో మొండి వ్యాధులను వదిలించి.. హోమియో కింగ్​గా పేరుగాంచారు. పేదలకు తక్కువ ఫీజుతోనే వైద్య సేవలు అందించేవారు.

Famous Homeopathic Dr Sohan Singh Passed Away in Hyderabad : హోమియో వైద్యం(Homeo medicine) పేరు చెబితే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇట్టే గుర్తుకొచ్చే పేరు డాక్టర్​ సోహన్​ సింగ్​(Dr Sohan Singh). ఈ ప్రఖ్యాత వైద్య నిపుణుడు ఇప్పుడు ఇక లేరు. గత శుక్రవారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని తన నివాసంలో హఠాత్తుగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే ఆయన మరణించినట్లు వెల్లడించారు. ఆయనకు భార్య విమల, కుమార్తె నీలిమ ఉన్నారు. చాలా ఏళ్ల క్రితమే కుమారుడు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు. తన కుమారుడి పేరు మీదే ధర్మకిరణ్​ ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు అండగా నిలిచారు.

Homeopathy Dr Sohan Singh Died of Heart Attack : ఎన్నో ప్రాంతాల్లో అతి తక్కువ ఫీజుతో వైద్య సేవలు అందించి.. తన జీతం, జీవితాన్ని వృత్తికి, హోమియోపతి వైద్యం అభివృద్ధికి అంకితం చేశారు. సోహన్​సింగ్​ అంటే ఏ ఉత్తరాది వ్యక్తోనని చాలా మంది భావిస్తారు. కానీ ఆయన అచ్చమైన తెలుగువాడు. ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని రావులపాడులో జన్మించారు. ఆయన తండ్రి వేణుగోపాలరావు స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన నేతల పేర్లనే తన కుమారులకు పెట్టుకున్నారు. అందులో భాగంగానే రెండో కుమారుడికి సోహన్​సింగ్​ బాక్నా పేరు పెట్టారు. వేణుగోపాలరావు కమ్యూనిస్టు పార్టీ తరఫున చురుగ్గా పని చేసేవారు.

ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ సి.ఆర్.రావు కన్నుమూత

King of Homeopathy Dr Sohan Singh : సోహన్​సింగ్​ బాల్యమంతా విజయవాడలోని గుడివాడలోనే గడిచింది. పీయూసీ తర్వాత హోమియోపతిలో డిప్లొమా పూర్తి చేసి.. ఉపాధి కోసం హైదరాబాద్​ చేరారు. ప్రభుత్వ కళాశాలలో జూనియర్​ లెక్చరర్​గా ఒక పక్క ఉద్యోగం చేస్తూనే చదువుకుని.. హోమియో వైద్యంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఎప్పుడూ తన జీతంలో 25 శాతం పక్కనపెట్టి హైదరాబాద్​ హోమియో కాలేజీ అభివృద్ధికి వినియోగించే వారు.

ఆయన ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు మనవరాలైన విమలను వివాహం చేసుకున్నారు. 1979లో మెదడువాపు వ్యాధితో ఎంతో మంది చనిపోయేవారు. అప్పుడు దానికి హోమియో మందులను అందించి చాలా మందిని కాపాడారు. అలాగే ఎన్నో మొండి వ్యాధులను తన వైద్యంతో నయం చేసి.. 'హోమియో కింగ్'​గా నామం సార్థకం చేసుకున్నారు.

ఇటీవల ఆస్పత్రిని సందర్శించి.. హైదరాబాద్​ హోమియో కళాశాలలో చాలా కాలం అధ్యాపకుడిగా పని చేసిన సోహన్​ సింగ్​.. ప్రిన్సిపల్​, సూపరింటెండెంట్​గా బాధ్యతలు నిర్వహించారు. రామంతాపూర్​ ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో రోగులు పడుతున్న కష్టాలను చూసి.. ఆయన రూ.20 లక్షల సొంత నిధులతో 2004లో 80 పడకల ఆస్పత్రిని నిర్మించి వైద్యశాలకు అంకితం చేశారు. ఈ నెల 21న తన సతీమణితో భవనాన్ని వీక్షించడానికి వెళ్లి.. తాను కట్టిన భవనాన్ని చూసి ఎంతో మురిసిపోయారు.

హోమియోపతి, వైద్య మండలి బిల్లులకు ఆమోదం

నేడు అంత్యక్రియలు..: ఇంతలో ఆయన గుండెపోటుతో కన్నుమూయడంతో అందరికీ తీవ్ర విషాదాన్ని నింపింది. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రామంతాపూర్​ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శనివారం నివాళులు అర్పించారు. ఆయన మృతిపై సీపీఐ నాయకులు తమ సంతాప సందేశం ఇచ్చారు. సోహన్​సింగ్​ వామపక్ష ఉద్యమానికి సన్నిహితంగా ఉండేవారని పేర్కొన్నారు.

హోమియో వైద్యంలో శిఖర సమానుడు డాక్టర్​ పావులూరి కన్నుమూత

'హోమియో'తో వ్యాధి మూలానికి మందు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.