ETV Bharat / state

Distribution of Second Phase Double Bedrooms : ఈనెల 21 నుంచి రెండోవిడత డబుల్​ బెడ్​రూమ్ ఇళ్ల పంపిణీ

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 5:32 PM IST

Draw System in Telangana Double Bedroom Scheme
Distribution of Second Phase Double Bedrooms in Hyderabad

Distribution of Second Phase Double Bedrooms in Hyderabad : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాలపై వేగం పెంచుతోంది. ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహ రచనలు చేస్తూ ముందుకు కొనసాగుతోంది. తొలి విడత డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ చేసిన ప్రభుత్వం తాజాగా రెండో విడతకు శుక్రవారం లక్కీ డ్రా నిర్వహించింది. డ్రాలో ఎంపికైన అభ్యర్థులకు ఇళ్లు పంపిణీ విధాన ప్రక్రియను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

Distribution of Second Phase Double Bedrooms in Hyderabad : హైదరాబాద్‌ మహానగర పరిధిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ రెండో విడతలో ఎంపికైన లబ్దిదారులకు ఈ నెల 21వ తేదీన ఇళ్లు పంపిణీ చేస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ వెల్లడించారు. శుక్రవారం రోజున మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో ఆన్‌లైన్‌ డ్రా నిర్వహించి 13,200 మంది లబ్దిదారులను ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. డ్రాలో ఎంపికైన లబ్దిదారులకు ఈ నెల 21వ తేదీన 9 ప్రాంతాల్లో మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా డబుల్ బెడ్‌ రూం ఇళ్లను పంపిణీ చేస్తారని వివరించారు.

Double Bedroom Houses Distribution in Hyderabad : రెండో విడత డబుల్‌ బెడ్‌ రూమ్‌ లక్కీ డ్రాలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన లబ్దిదారులను ఎంపిక చేశారు. ఇళ్ల పంపిణీ ప్రక్రియను వివరించిన మంత్రి తలసాని నియోజకవర్గాల వారిగా పాల్గొనే నాయకుల వివరాలను సైతం వెల్లడించారు. అందులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్​లో మంత్రి కేటీఆర్(Minister KTR) 2100 మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

మహేశ్వరం పరిధిలోని మన్​సాన్​ పల్లిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి 700 మంది లబ్ధిదారులకు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అట్టిగూడలో మంత్రి మహేందర్ రెడ్డి 432 మందికి అదే నియోజకవర్గ పరిధిలోని తట్టి అన్నారంలో హోంమంత్రి మహమూద్ అలీ 1268 మందికి, తిమ్మాయిగూడలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి 600 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారని మంత్రి పేర్కొన్నారు.

2BHK Flats Lucky Draw in Hyderabad Today : GHMC పరిధిలో రెండో విడత డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీకి లక్కీ డ్రా

Draw System in Telangana Double Bedroom Scheme : పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు 2 లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు 4800 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారని తలసాని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్ 3 లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 1200 మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారని.. ఉప్పల్ పరిధిలోని చర్లపల్లిలో 1000 మంది లబ్దిదారులకు ఇండ్లను తాను పంపిణీ చేస్తానని మంత్రి తలసాని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతాప సింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ 1100 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారని వివరించారు.

హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అధ్యక్షతన శుక్రవారం ఈ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఎంతో పారదర్శకంగా ఎన్ఐసీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్​వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్​లైన్ డ్రా నిర్వహించినట్లు వివరించారు. మరిన్ని విడతల్లో డబుల్ బెడ్​ రూమ్ ఇళ్ల పంపిణీ ఎంపిక ప్రక్రియ కొనసాగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

Revenue Inspector Cheating On Double Bed Room Houses : డబుల్​ బెడ్​ రూం ఇళ్ల వెరిఫికేషన్​ పేరుతో రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ మోసం...!​
Kishan Reddy fires on KCR : 'నిజాంలా ఇల్లు నిర్మించుకున్నారు.. పార్టీలకు స్థలాలు కేటాయించారు.. మరి పేదవారికి ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.