ETV Bharat / state

సమయం లేదు మిత్రమా - ప్రతి ఇల్లు తిరగాల్సిందే - ప్రతి ఓటరు మనసు గెలవాల్సిందే

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 12:34 PM IST

Congress Election Campaign
Congress

Congress Election Campaign Telangana 2023 : సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడటంతో.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గడగడపకు తిరుగుతూ.. ప్రజలకు ఆరు గ్యారంటీలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పలు చోట్ల అభ్యర్థులు.. అధికారంలోకి రాగానే.. గ్యారంటీలను అమలు చేస్తామని, పార్టీ మారమంటూ బాండ్‌ పేపర్‌లు రాసిస్తున్నారు. మరోవైపు రైతు బంధు బంద్‌ చేయడంపై.. బీఆర్​ఎస్​ విమర్శలను.. కాంగ్రెస్‌ అగ్రనేతలు తిప్పికొడుతున్నారు.

సమయం లేదు మిత్రమా - ప్రతి ఇల్లు తిరగాల్సిందే - ప్రతి ఓటరు మనసు గెలవాల్సిందే

Congress Election Campaign Telangana 2023 : ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ(Congress Party).. జోరుపెంచింది. సాయంత్రంతో మైకులు మూగబోనుండటంతో.. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం క్రైస్తవులకు చేసింది ఏమిలేదంటూ.. ఇండియన్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు శామల జోషప్‌.. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. మలక్‌పేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. కర్ణాటకలో అమలవుతున్న ఆరు గ్యారంటీల తీరును.. కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బలక్కర్‌.. ప్రజలకు వివరించారు. నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్‌ను గెలిపించాలంటూ.. ఓటర్లను అభ్యర్థించారు.

Mallikarjun Kharge Fires On KCR : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని హనుమాన్ దేవాలయంలో ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక.. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్​పై రాసి పూజలు చేసి ప్రమాణం చేశారు. మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేటలోని పలు గ్రామాల్లో.. కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు.

కామారెడ్డిపైనే స్పెషల్ ఫోకస్ - హేమాహేమాలుగా పార్టీ అధినేతలు - పోరులో నెగ్గేదెవరు?

కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధు నిలిపివేయడంపై మంత్రి హరీశ్‌రావు తమ పార్టీపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ బహిరంగ సభకు హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే తమ పార్టీ ఇచ్చిన మాటకు ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉంటుందన్నారు.

"కేసీఆర్​ కాంగ్రెస్​పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రైతుబంధు కేంద్రం ఎన్నికల సంఘం​ ఆపితే.. కాంగ్రెస్​ ఆపిందని ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రంలో మా ప్రభుత్వం లేదు.. ఎలక్షన్​ మా ఆధీనంలో లేదు. బీఆర్​ఎస్​ నేతలు అంటున్న మాటల్లో వాస్తవం లేదు." - మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

Bhupesh Baghel Comments On BRS : రైతుబంధు డబ్బుల విడుదల విషయంలో బీఆర్​ఎస్​ నేతల తీరును.. ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్ తప్పు బట్టారు. నిజంగా రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే తమలా ఎన్నికల షెడ్యూలుకి ముందే ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి తరపున పట్టణంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం నిజామాబాద్‌ నగరంలో.. కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతితో కలిసి.. కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేశారంటూ.. భూపేశ్​ బఘేల్‌ ధ్వజమెత్తారు.

Jeevan Reddy Election Campaign Jagtial : ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తుండటంతో జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్‌ అభ్యర్థి టి. జీవన్‌రెడ్డి భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాత బస్టాండ్‌, టవర్‌ సర్కిల్‌, కొత్త బస్టాండ్‌ వరకు సాగిన ర్యాలీలో దుకాణాల్లో ఉన్న ఓట్లర్లను కలుస్తూ ప్రచారం చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్రాంత ఐపీఎస్ కేఆర్ నాగరాజు విస్తృతంగా పర్యటించారు.

హుస్నాబాద్​లో షురూ గజ్వేల్​లో ముగింపు - ఈ ఎన్నికల్లో కేసీఆర్ పాల్గొన్న సభల సంఖ్య ఎంతంటే?

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో రాత్రి కాంగ్రెస్‌ పార్టీ నర్సంపేట అభ్యర్థి దొంతి మాధవరెడ్డి ప్రచారం చేస్తుండగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి.. సుడిగాలి పర్యటన చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరు గ్యారెంటీ పథకాలను అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేస్తామంటూ.. ఆలయంలో ప్రమాణం చేశారు. బోనకల్ మండలం చొప్పకట్లపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తూ బాండుపై సంతకం చేశారు.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్ధి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశంతో కలిసి.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేశారు. నెలలో 22 రోజులు ఫామ్ హౌస్​లో ఉండి నాలుగు రోజులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ.. దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీల పేరుతో ఇప్పటికే నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్‌ అభ్యర్థులు.. తమ గెలుపుపై ధీమాతో ఉన్నారు.

"రైతుబంధు డబ్బులు కేసీఆర్​ ఆధీనంలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఆపిందని బురద చల్లడం తగదు. బీఆర్​ఎస్​ ఆటలు ఇక సాగవు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మా పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. అందుకే.. నాయకులంతా చర్చించుకుంటారు.. కేసీఆర్​లా హిట్లర్​ పాలన కాదు." - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , కాంగ్రెస్‌ ప్రచారకమిటీ కో ఛైర్మన్‌

చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించనున్న కాంగ్రెస్‌ - నేడు రాష్ట్రంలో రాహుల్, ప్రియాంక ప్రచారం

చిల్లర సమస్యకు చెక్​- క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో కాయిన్స్​- ఎలా విత్​ డ్రా చేయాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.