55 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్​కు రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన ఇప్పుడు వచ్చిందా : కేటీఆర్

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 6:52 PM IST

thumbnail

KTR Road Show At Mancherial : 24 గంటలు కరెంటు ఇచ్చే వారసత్వ ప్రభుత్వం కావాలా.. 3-5 గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగిన రోడ్ షోలో బాల్క సుమన్​ను గెలిపించాలంటూ కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దుర్మార్గుడైన రేవంత్ రెడ్డి రైతుబంధు పథకాన్ని అడ్డుకునేందుకు కుట్ర పన్నాడని అందుకే ఈ రోజున రైతుల ఖాతాలో డబ్బులు పడలేదని మండిపడ్డారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు. 

ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు హమీలు ఇవ్వడం సహజమని.. కానీ ఎవరు వాటిని అమలు చేస్తారో ప్రజలు గ్రహించి ఓటు వేయాలని సూచించారు. చెన్నూరు నియోజకవర్గాన్ని కనివిని ఎరుగని రీతిలో బాల్క సుమన్ అభివృద్ధి చేశారని మరోసారి ఆయనని ఆశీర్వదించాలని కోరారు. డబ్బులు సంచులతో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కుటుంబం చెన్నూరును పాలించి చేసింది ఏం లేదని విమర్శించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.