ETV Bharat / state

వాస్తవాలు దాచిపెట్టి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము : రేవంత్‌ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2023, 7:07 PM IST

Updated : Dec 20, 2023, 7:55 PM IST

CM Revanth Reddy
CM Revanth Reddy Answered Akbaruddin Owaisi Questions

CM Revanth Reddy Answered Akbaruddin Owaisi Questions : వాస్తవాలు దాచిపెట్టి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని సీఎం రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ వారి కుటుంబ తగాదాలను సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణను దేశంలో బలమైన రాష్ట్రంగా నిలపడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ శ్వేతపత్రంపై అనుమానం వ్యక్తం చేయడంపై అసెంబ్లీ వేదికగా సమాధానం ఇచ్చారు.

CM Revanth Reddy Answered Akbaruddin Owaisi Questions : తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే తమ లక్ష్యమని, వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం(White Paper)పై అక్బరుద్దీన్‌ అనుమానం వ్యక్తం చేయడంపై ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. అర్హులకు సంక్షేమాన్ని అందించి దేశంలోనే తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆర్ధిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చిన నివేదికనే అసెంబ్లీ ముందు ఉంచామన్నారు.

ఆర్‌బీఐ, కాగ్‌ నుంచి సమాచారం తీసుకుని, అవసరమైన చోట వారి నివేదికలను ప్రస్తావించామని తెలిపారు. రాష్ట్ర నిధుల విషయంలో ఆర్‌బీఐ(RBI) రోజూ ఓ నివేదిక ఇస్తుందని చెప్పారు. 2014-15 మధ్యలో 300 రోజులు తమకు మిగులు నిధులు ఉన్నాయని, కానీ గత ఐదేళ్లలో కనీసం 150 రోజులు కూడా మిగులు నిధులు లేవని ధ్వజమెత్తారు. అప్పు కోసం రోజూ ఆర్‌బీఐ వద్ద నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వివరించారు.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి : వాస్తవాలు దాచి గొప్పలు చొప్పుకోబట్టే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. జీతాల ఆలస్యం వల్ల ఉద్యోగుల సిబిల్‌ స్కోరు(CIBIL Score) దెబ్బతింటోందని తెలిపారు. ఆఖరికి బ్యాంకులు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అప్పులు ఇవ్వట్లేదని చెప్పారు. వాస్తవాలు కఠోరంగా ఉన్నప్పుడు వాటిని అంగీకరించాలని సీఎం హితవు పలికారు. మన కుటుంబ సభ్యుడు ఒకరు తప్పు చేస్తే, ఆ తప్పును అంగీకరించాలని సూచించారు. ఈ వాస్తవాలు కొందరికీ చేదుగా ఉండొచ్చని, ఇంకొందరికీ కళ్లు తెరిపించవచ్చని చెప్పారు.

శాసనసభలో 42 పేజీల శ్వేతపత్రం - తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు

CM Revanth Reddy speech in Legislative Assembly : విద్యుత్‌, సాగునీటి రంగాలపైనా శ్వేతపత్రాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించడమే తమ లక్ష్యమని చెప్పారు. విపక్షాల నుంచి బలమైన సహకారం పొందడమే తమ ప్రభుత్వ విధామన్నారు. అధికారం కోల్పోవడం కొందరికి బాధ కలిగించొచ్చు, అధికారం కోసం తండ్రిని పక్కకు పెట్టిన ఔరంగజేబు వంటి వారు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌(Praja Bhavan)గా మార్చామని పేర్కొన్నారు. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు.

నిధుల కోసం ప్రధానికి ఫోన్‌ చేశా : రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కిషన్ రెడ్డికి తానే ఫోన్ చేసినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, ప్రతీ నిర్ణయంపై అఖిలపక్షం సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. బీఆర్‌ఎస్‌ వారి కుటుంబ తగాదాలను సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.

వాస్తవాలు దాచిపెట్టి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము : రేవంత్‌ రెడ్డి

ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించి - రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు : సీఎం రేవంత్‌ రెడ్డి

శ్వేతపత్రం విడుదలను తప్పుపట్టిన అక్బరుద్దీన్‌ - కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్‌ బాబు

Last Updated :Dec 20, 2023, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.