ETV Bharat / state

'వైరస్​ తగ్గేవరకు ప్రజలు ఇదే స్ఫూర్తితో ఉండాలి'

author img

By

Published : Apr 26, 2020, 5:12 AM IST

రాష్ట్రంలో కరోనా పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టేవరకు ప్రస్తుత పంథానే పకడ్బందీగా కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇదే స్ఫూర్తితో సర్కారుకు సహకరించాలని ఆయన కోరారు.

cm kcr pressmeet with officials
'వైరస్​ తగ్గేవరకు ప్రజలు ఇదే స్ఫూర్తితో ఉండాలి'

లాక్‌డౌన్‌, కంటైన్‌మెంట్‌ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని... ప్రజలు ఇదే స్ఫూర్తితో ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ కోరారు. ప్రగతిభవన్‌లో కొవిడ్‌పై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

కరోనా నియంత్రణలో ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రానికి నివేదించడంతో పాటు అవసరమైన సహకారం కోరదామని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. రేపు ప్రధాని మోదీ నిర్వహించనున్న దృశ్యమాధ్యమ సమీక్షలో కరోనా నియంత్రణకు రాష్ట్రాలకు అవసరమైన నిధులివ్వడం, ఎఫ్​ఆర్​బీఎం నిధుల సడలింపు తదితర అంశాలపై గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు.

ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్​డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.