ETV Bharat / state

BRS Assembly Elections Campaign Telangana 2023 : ప్రచార జోరు పెంచిన బీఆర్ఎస్.. కేసీఆర్ భరోసాతో ప్రజల్లోకి

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2023, 8:31 AM IST

BRS Assembly Elections Campaign Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్ అభ్యర్థులు విస్తృతంగా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. విపక్షాలు ఇస్తున్న హామీలను నమ్మవద్దని సూచిస్తున్నారు. కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమంటున్న నేతలు.. గులాబీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ తమకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Telangana Assembly Elections 2023
BRS Assembly Elections Campaign 2023

BRS Assembly Elections Campaign 2023 ప్రచార జోరు పెంచిన బీఆర్ఎస్.. మేనిఫెస్టో వివరిస్తూ ఓటు వేయాలని విజ్ఞప్తి..

BRS Assembly Elections Campaign Telangana 2023 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ ప్రచార జోరును పెంచింది. మేనిఫెస్టోతో పాటు పదేళ్ల ప్రగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రచారంలో దూకుడు పెంచింది. ఇంటింటి ప్రచారాలు, ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పార్టీ నేతలు.. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో హ్యాట్రిక్‌ కొట్టి గులాబీ జెండా ఎగరేసేందుకు.. గులాబీదళపతి సూచనలతో అభ్యర్థులు ముందుకెళ్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి.. అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ నాయకులు ఓట్ల కోసం గ్రామాల్లోకి వస్తే వారిని తిరగనివ్వొద్దని.. ఎంపీ మాలోతు కవిత అన్నారు.

CM KCR Election Campaign Vehicle : ఎన్నికలకు కేసీఆర్ ప్రచారరథం సిద్ధం.. హుస్నాబాద్​లో తొలి శంఖారావం

Telangana Assembly Elections 2023 : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని.. మెదక్‌ జిల్లా రామాయంపేటలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా.. పోడు భూముల సమస్యలు పరిష్కరించాలంటూ స్థానికులు కాసేపు ఆందోళనకు దిగారు. మరోసారి బీఆర్ఎస్​ను ప్రజలు ఆశీర్వదించాలని.. నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ పోలింగ్ @30 డేస్.. 'అభివృద్ధి' మంత్రంతో బీఆర్ఎస్ .. 'బీసీతంత్రం'తో బీజేపీ .. 'ఆరింటి'పైనే ఆశలతో కాంగ్రెస్

BRS Leaders Elections Campaign : రైతులను చులకనగా చూసే కాంగ్రెస్ నేతలకు ఓటు అడిగే హక్కు లేదని.. ములుగు జిల్లా తాడ్వాయిలో బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో పేద వర్గాల అభ్యున్నతికి తోడ్పడేలా ఉందని మంచిర్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్‌ తెలిపారు. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ముంపు గ్రామం సింగారంలో.. బీఆర్ఎస్​కే ఓటు వేస్తామని గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. బీఆర్ఎస్ బీఫామ్ తనకే వస్తుందని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం ధీమా వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నాననే మాట అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సికింద్రాబాద్​లో పర్యటించినా మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ గెలవలేకపోయిందని డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు అన్నారు.. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని వారికి పని చేసే బాధ్యత కూడా తమపై ఉందని పద్మారావు స్పష్టం చేశారు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెట్టుగూడ డివిజన్లలోని మైలార్ గడ్డ, డి బి అర్ ప్రాంతాలలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.. సికింద్రాబాద్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని ప్రజల్లో అనునిత్యం ఉండే తమకే ప్రజల మద్దతు ఉంటుందని ఆయన వెల్లడించారు..

BRS 30 Days Election Campaign Plan : బీఆర్ఎస్​ సరికొత్త ప్లాన్​.. విజయం సాధించేందుకు 'స్వాతిముత్యం' ఫార్ములా

Mahabubnagar Assembly Poll : పాలమూరులో హ్యాట్రిక్ కోసం BRS.. మరో ఛాన్స్ అంటున్న కాంగ్రెస్.. బోణీ కొట్టేందుకు BJP రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.