ETV Bharat / state

BRS 30 Days Election Campaign Plan : బీఆర్ఎస్​ సరికొత్త ప్లాన్​.. విజయం సాధించేందుకు 'స్వాతిముత్యం' ఫార్ములా

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2023, 2:47 PM IST

Updated : Oct 30, 2023, 2:57 PM IST

BRS 30 Days Election Campaign Plan in Telangana : రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని దక్కించుకునేందుకు బీఆర్​ఎస్​ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. 30 రోజులే గడువు ఉన్నందున ఓటర్లను కనీసం 30 సార్లైనా కలిసే విధంగా ప్రణాళికలు రచించింది. కార్యకర్తలను ఈ ప్లాన్​కు అనుగుణంగా ప్రచారం చేయాలని సూచించింది.

KTR Instruction to BRS Followers
BRS Election Campaign on Social Media

BRS 30 Days Election Campaign Plan in Telangana : ఎన్నికల ప్రచారానికి మరో నెల రోజులు మాత్రమే ఉండటంతో నగరంలో బీఆర్​ఎస్​ క్షేత్రస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో బీఆర్ఎస్​ చేసిన అభివృద్దిని ప్రజలకు చూపించి.. గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ దక్కించుకునేందుకు 'స్వాతిముత్యం(Swathimutyam Movie)' సినిమా ఫార్ములాను ఉపయోగించాలని కార్యకర్తలకు సూచించింది.

BRS Use Swathimutyam Formula for Election Campaign : అన్ని నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ పార్టీ తరఫున ఇప్పటికే బూత్‌ స్థాయి కమిటీలను అభ్యర్థులు ఏర్పాటు చేశారు. వీరు రాబోయే 30 రోజులపాటు తమకు కేటాయించిన 100 మంది ఓటర్లను కలుసుకుని ఓటు అభ్యర్థించాలని పార్టీ ఆదేశించింది. ఒకసారి అడిగి వదిలేయకుండా 30 సార్లైనా వారిని కలవాలని కార్యకర్తలకు బీఆర్​ఎస్​ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. స్వాతిముత్యం సినిమాలో సోమయాజులు ఉద్యోగం ఇస్తా అని హామీ ఇచ్చే వరకు కమలహాసన్‌ వదిలిపెట్టలేదని.. అలాగే తమకు ఓటు వేస్తామని హామీ ఇచ్చే వరకు ఓటరును రోజూ కలుస్తూనే ఉండాలని సూచించారు.

KTR Instruction to BRS Followers : రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని.. కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్న దానితో పోల్చి చెప్పి స్పష్టంగా వివరించాలని కేటీఆర్​ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో హూషారుగా ఉండాలని.. అందరితో కలిసి ముందుకు సాగాలని సూచించారు. ఈ నెల మరింత కీలకమని.. ప్రజలకు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు, వాటి విజయాలను స్పష్టంగా వివరించాలని.. మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు.

BRS Election Campaign in Full Josh : ఇంటింటి ప్రచారంతో నేతలు.. గెలుపు వేటలో గులాబీ పరుగులు

BRS Election Campaign on Social Media : సోషల్‌ మీడియాలో దుమ్మురేగేలా.. చాలా రోజుల క్రితం జరిగిన విషయాలను ప్రజలు మర్చిపోవడం సహజమని.. అప్పుడు, ఇప్పుడు మార్పు తెలిపే చోట ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలని క్యాడర్‌కు సూచించారు. క్షేత్రస్థాయి, గ్రామ, మండల స్థాయిలో వాట్సాప్​ గ్రూపులు(Campaign in Whats app Groups) తయారు చేసి.. బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధిని తెలియజేయాలని అన్నారు. మరి ముఖ్యంగా స్థానికంగా జరిగిన విషయాలను పోస్ట్​ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ క్రమంలోనే పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను క్షమించలేదు. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ బీఆర్​ఎస్​(BRS) అధ్యక్షుడు కృష్ణారెడ్డిని పార్టీ పదవీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను చేర్చుకుంటున్నారు. పార్టీలో నాయకుల చేరికతో కార్యకర్తలకు మరింత జోష్​ని నింపుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి ఘటనపై గవర్నర్‌ తమిళిసై విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అన్నారు. దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల భద్రతపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.

CM KCR Speech in BRS Public Meeting at Aleru : కాంగ్రెస్​ హయాంలో టపాసులు మాదిరి ట్రాన్స్​ఫార్మర్లు పేలుతుండేవి : సీఎం కేసీఆర్​

KTR Interesting Comments on TSPSC : 'డిసెంబరు 3 తర్వాత TSPSC ప్రక్షాళన.. నాదే బాధ్యత'

Minister KTR Participate in BRS Booth Level Meeting : 'ఈ 30 రోజులు సెల్ఫీ కొట్టు.. ఓటు పట్టుతో సోషల్​ మీడియాలో దుమ్ము లేవాలి'

Last Updated :Oct 30, 2023, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.