ETV Bharat / state

KTR Interesting Comments on TSPSC : 'డిసెంబరు 3 తర్వాత TSPSC ప్రక్షాళన.. నాదే బాధ్యత'

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2023, 8:51 AM IST

KTR Interesting Comments on TSPSC : తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం.. బలమైన నాయకత్వం ఉందని కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. కొన్ని చోట్ల తప్పులు జరిగాయని.. అది తాను ఒప్పుకొంటానని పేర్కొన్నారు. డిసెంబరు 3 తర్వాత టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయటానికి తానే బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హమీ ఇచ్చారు.

ktr
ktr

KTR Interesting Comments on TSPSC : తెలంగాణ ఉద్యమ సమయంలో వందల మంది యువత బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌ను పొరపాటున కూడా నమ్మొద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ (KTR) పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీలు సోషల్‌ మీడియాలో పార్టీపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు. సామాజిక మాధ్యమాలను ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

KTR Meeting With BRS Student Wing Leaders : తెలంగాణ ఉద్యమ సమయంలో 10 ఏళ్లు ఉన్న పిల్లలకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందని.. వారికి రాష్ట్ర ఏర్పాటుకు ముందు పరిస్థితిని, ప్రస్తుత అభివృద్ధిని వివరించాలని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రూప్‌-2 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది బండి సంజయ్‌ (Bandi Sanjay), ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ కాదా అని ప్రశ్నించారు. రద్దు చేస్తే గొడవ చేసింది కూడా వాళ్లే కదా? అని అన్నారు. కోర్టులో కేసు వేసి గ్రూప్‌-2 రద్దు చేయించారని ఆరోపించారు. కడుపులో గుద్ది.. నోట్లో పిప్పరమెంటు పెడతారని కేటీఆర్ విమర్శించారు.

KTR Reacts on Adilabad Amit Shah Speech : 'అమిత్ షా, మోదీ ఎన్ని అబద్ధాలాడినా బీజేపీకి తిరస్కారం తప్పదు'

KTR On TSPSC Issue : కొన్ని చోట్ల తప్పులు జరిగాయని.. అది తాను ఒప్పుకొంటానని కేటీఆర్ తెలిపారు. డిసెంబరు 3 తర్వాత టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయటానికి తానే బాధ్యత తీసుకుంటానని హమీ ఇచ్చారు. మొన్న అమిత్‌ షా (Amit Shah) వచ్చి బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. సేద్యానికి 24 గంటల కరెంట్‌ ఇస్తున్న తెలంగాణకు వచ్చి.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) తమ రాష్ట్రంలో 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడంలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

KTR Meeting with Students : 'తెలంగాణ సాధించిన ప్రగతిని.. ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంవత్సరానికి 1000 ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిందని.. బీఆర్‌ఎస్‌ గత 10 సంవత్సరాల్లో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు. మరో 90,000 ఉద్యోగాలు వివిధ ప్రక్రియలో ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ హబ్‌లను ఏర్పాటు చేసి అభివృద్ధి చేశామని వివరించారు. దేశంలో జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని కేటీఆర్ వెల్లడించారు.

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం.. బలమైన నాయకత్వం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ విద్యార్థి సంఘాల నాయకులు రాబోయే 30 రోజుల్లో ఎక్కడ గట్టి పోటీ ఉంటుందో.. అక్కడికి వెళ్లి విస్తృతంగా ప్రచారంలో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

KTR Fires on Congress : 'రాహుల్, రేవంత్​ లాంటి వాళ్లుంటారని గాంధీజీ ఆనాడే ఊహించారేమో..?'

Minister KTR Chit Chat : 'డబ్బులు ఇచ్చిన వారికే కాంగ్రెస్‌లో టికెట్లు.. అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్​లో తన్నులాటే'

KTR at LBnagar BRS Booth Committees Meeting : 'కాంగ్రెస్‌ పార్టీ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, మత కల్లోలాలు.. కర్ణాటక పరిస్థితి మనకొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.