ETV Bharat / state

తెరాస సర్కార్‌పై పోరాటానికి భాజపా 'ఆర్​టీఐ' అస్త్రం..!

author img

By

Published : Jul 7, 2022, 10:25 AM IST

తెరాస సర్కార్‌పై పోరాటానికి భాజపా 'ఆర్​టీఐ' అస్త్రం..!
తెరాస సర్కార్‌పై పోరాటానికి భాజపా 'ఆర్​టీఐ' అస్త్రం..!

BJPs RTI weapon: తెరాస సర్కార్‌పై పోరాటానికి భాజపా మరో వ్యూహాన్ని ఎంచుకుంది. ఇప్పటి వరకు ఆరోపణలకే పరిమితమైన కమలనాథులు.. ఇప్పుడు సమాచార హక్కు చట్టం (ఆర్​టీఐ) అస్త్రాన్ని సంధించారు. తెరాస పాలనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 80కి పైగా అంశాలపై దరఖాస్తులు దాఖలు చేశారు. వీటికి సమాధానాలు వచ్చినా, రాకున్నా.. మరిన్ని ప్రశ్నలను ఆర్​టీఐ ద్వారా సంధించేందుకు భాజపా సిద్ధమవుతోంది.

తెరాస సర్కార్‌పై పోరాటానికి భాజపా 'ఆర్​టీఐ' అస్త్రం..!

BJPs RTI weapon: తెరాస సర్కార్‌ వైఫల్యాలు జనంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా భాజపా వివిధ ఎత్తుగడలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ 8 ఏళ్ల పాలనపై సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా వాడుకోవాలని నిర్ణయించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆర్​టీఐకి ఇప్పటికే 88 అంశాలపై దరఖాస్తులు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ వివిధ సందర్భాల్లో చేపట్టిన జిల్లా పర్యటనల నుంచి మొదలుకొని.. శాసనమండలి, శాసనసభలో ఇచ్చిన హామీల వివరాలు కోరారు. ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన అంశాలు, ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులు, పెండింగ్‌లో ఉన్నవెన్ని? ఎన్ని తిరస్కరించారు? పూర్తి సమాచారం ఇవ్వాలని బండి సంజయ్‌ అడిగారు. ఇప్పటి వరకు ఆర్​టీఐకి మొత్తం 88 అంశాలపై 60 అర్జీలు పెట్టారు.

ఈ దరఖాస్తుల్లో ప్రధానంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2, 2014 నుంచి జూన్ 2, 2022 వరకు సీఎం కేసీఆర్​ ఇచ్చిన హమీలు, వాటి అమలుపై వివరాలు అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఇరుకున పెట్టేందుకు ఆయన ఎన్ని రోజులు అధికారిక నివాసంలో బస చేశారు? ఎన్ని రోజులు వ్యవసాయ క్షేత్రంలో బస చేశారో సమాధానం ఇవ్వాలని కోరారు. ప్రగతి భవన్ నిర్మాణానికి చేసిన ఖర్చెంత? నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడు పూర్తి చేశారంటూ వివరాలను ఇవ్వాలని దరఖాస్తు చేశారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు సాగు నీరందించారో చెప్పాలని కోరారు.

స్పందన చూసి మరిన్ని ప్రశ్నలు..: నిత్యం విమర్శలు చేస్తున్న అనేక అంశాలను ఈ సమాచార హక్కు ద్వారా అడగలేదు. దీని వెనుక మరో వ్యూహం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రజల నుంచి వచ్చిన అంశాలను మాత్రమే ఆర్​టీఐ ద్వారా ప్రశ్నించి.. స్పందన చూసి మరిన్ని ప్రశ్నలు అడిగేందుకు కమలనాథులు సిద్ధం అవుతున్నారు. తెరాస ప్రభుత్వ హయాంలో అనేక అంశాల్లో అవినీతి జరిగిందంటూ భాజపా నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఒక ఏటీఎంలా మారిందంటూ ఏకంగా కమల దళపతి నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరోపిస్తున్నారు.

భవిష్యత్తులో మరిన్ని అంశాలపైనా..: మిషన్‌ భగీరథ్‌తో పాటు మిషన్ కాకతీయపై భాజపా నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే వీటిపై సమాచార హక్కు ద్వారా ఎలాంటి వివరాలు కోరలేదు. ప్రస్తుతానికి ప్రజా సమస్యలపైనే ఆర్​టీఐ ద్వారా ప్రశ్నలు సంధించామని.. అయితే భవిష్యత్తులో మరిన్ని అంశాలపైనా సమాధానాలు రాబడుతామని కమలనాథులు చెబుతున్నారు.

ఇవీ చూడండి..:

'ఇగోలు పక్కన పెట్టండి... పార్టీలోకి వచ్చేవారిని వదులుకోకండి..'

'నెలకు ఒక్క లీడర్‌నైనా భాజపాలోకి తీసుకొస్తా..'

డోలో-650 మాత్రల తయారీ సంస్థపై ఐటీ దాడులు.. ఒకేసారి 40 చోట్ల..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.