ETV Bharat / state

BJP Manifesto Telangana 2023 : ప్రధాని మోదీ గ్యారెంటీగా.. ఏడు హామీలతో బీజేపీ 'ఇంద్రధనస్సు' మేనిఫెస్టో

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 12:25 PM IST

Updated : Oct 16, 2023, 8:48 PM IST

BJP Manifesto Telangana 2023 : గులాబీతోటలో కమల వికాసమే లక్ష్యంగా కాషాయదళం ముమ్మర కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించిన బీజేపీ.. బుధవారం తొలి జాబితా విడుదల చేయనుంది. అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించేలా కసరత్తు చేస్తున్న బీజేపీ.. మేనిఫెస్టోకు ఇంద్రధనుస్సు అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. బీఆర్​ఎస్​ మేనిఫెస్టో, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ధీటుగా.. ఏడు ప్రధాన అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ హామీలకు ప్రధాని మోదీనే గ్యారెంటీ అంటూ ఎన్నికల ప్రణాళిక ప్రకటించనుంది.

BJP Telangana Election Manifesto Preparation
BJP Telangana Election Manifesto Preparation

BJP Telangana Election Manifesto Preparation 60మందితో బుధవారం తొలి జాబితా విడుదల

BJP Manifesto Telangana 2023 : బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా.. మరింత ఆలస్యమయ్యేలా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు మరో మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు వరకు తొలి జాబితా(BJP MLA First List 2023) వస్తుందని అంతా భావించారు.. కానీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మాత్రం తెలంగాణ అభ్యర్థులపై ఎలాంటి ప్రకటన చేయలేదని సమాచారం. నేడో, రేపో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల జాబితాపై కసరత్తు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 60మందితో.. ఈనెల 18న తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న బీజేపీ.. కేంద్రమంత్రులు, జాతీయ నేతలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.

BJP Election Plan in Telangana : ప్రజల్ని ఆకర్షించేలా ఎన్నికల ప్రణాళికను.. కమలం పార్టీ సిద్ధం చేస్తోంది. అన్ని వర్గాలకు చెందిన అంశాలు పొందుపరిచేలా.. మేధావులు, నిపుణుల సలహాలు సూచనలు స్వీకరిస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టో(BJP Election Manifesto) కమిటీ ఛైర్మన్‌ వివేక్‌ వెంకటస్వామి అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఈ సూచనలపై కసరత్తు చేసింది.

BJP Rainbow manifesto in Telangana 2023 : మరోవైపు బీసీల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టాల్సిన సంక్షేమ పథకాలపై బూరనర్సయ్య గౌడ్​ నేతృత్వంలోని ఉపకమిటీ చర్చించేందుకు సమావేశమైంది. ఆ కమిటీ బీసీల జీవన ప్రమాణాలు పెంపొందించేటువంటి సంక్షేమ పథకాలకు రూపొందించి మేనిఫెస్టో కమిటీకి అందించనుంది. మేనిఫెస్టోలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, కర్షకులు.. మహిళలు, యువత, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ ప్రకటించిన ప్రణాళికకి దీటుగా బీజేపీ ప్రకటించే మేనిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

BJP Candidate List 2023 Assembly Election : బీజేపీ నయా ప్లాన్​.. అసెంబ్లీ ఎన్నికల బరిలో 18 మంది ఎంపీలు

BJP Telangana Manifesto Preparation : అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవ వేడుక(Telangana Formation Day)లను గ్రామగ్రామంలో ఘనంగా నిర్వహిస్తామని బీజేపీ వర్గాలు పేర్కొననున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద.. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు, ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా 24 గంటలు ఉచితంగా సురక్షితమైన తాగునీరు, కులవృత్తులకు ఉచిత కరెంట్‌ ఇవ్వాలని భావిస్తోంది. రజక, నాయిబ్రాహ్మనుల లాండ్రి, సెలూన్లకు ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 250 యూనిట్ల వరకు.. ఉచిత కరెంట్ అందిస్తోంది. ఆ పథకాన్ని రజక, నాయిబ్రాహ్మనులు, వడ్రంగి, విశ్వబ్రాహ్మణులు, చేతివృత్తులు, చిరువ్యాపారులకు.. వర్తింప చేయాలని యోచిస్తోంది.

మెట్రోరైలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, ఎస్సీ కాలనీలు, మురికివాడల్లో ఆస్తి పన్ను మాఫీ హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కర్షకులతో పాటు కౌలు రైతులకు.. రైతుబంధు, బీమా సౌకర్యం, ఫించన్ల కొనసాగింపు.. మహిళలకు పావలా వడ్డీ రుణాలు, ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, సంక్షేమ పథకాల్లో పారదర్శకత పాలన అందించేలా బీజేపీ ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

Rajnath Singh Telangana Tour today : బరిలోకి బీజేపీ జాతీయ నేతలు.. ప్రచారంలో పాల్గొనేందుకు నేడు రాష్ట్రానికి రాజ్​నాథ్ సింగ్

Telangana BJP MLA Candidates First List Delay : బీజేపీ తొలి విడత అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం.. అప్పటిదాకా ఆగాల్సిందే..!

Last Updated :Oct 16, 2023, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.