ETV Bharat / state

ఎంపీ వెంకటరెడ్డితో భట్టి విక్రమర్క భేటీ.. పాదయాత్రకు రావాలని ఆహ్వానం

author img

By

Published : Mar 12, 2023, 2:50 PM IST

clp
clp

Bhatti Vikramarka Meet MP Venkat Reddy: హైదరాబాద్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు.. పార్టీలో స్థితిగతులపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ నెల 16 నుంచి తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు వెంకట్‌రెడ్డికి భట్టి వివరించారు. తన పాదయాత్రలో పాల్గొనాలని కోమటిరెడ్డిని ఆయన ఆహ్వానించారు.

ఎంపీ వెంకటరెడ్డితో భట్టి విక్రమర్క భేటీ.. పాదయాత్రకు రావాలని ఆహ్వానం

Bhatti Vikramarka Meet MP Venkat Reddy: పార్టీ అధిష్ఠానం అనుమతితోనే రాష్ట్రంలో నేతల పాదయాత్రలు కొనసాగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. ఈనెల 16 నుంచి భట్టి పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు.. పార్టీలో స్థితిగతులపై ఇరువురూ చర్చించారు. ఇందులో భాగంగానే తన పాదయాత్రలో పాల్గొనాలని కోమటిరెడ్డిని ఆహ్వానించానని భట్టి విక్రమార్క తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. దీంతో పాటు యాత్రకు సంబంధించి వెంకట్‌రెడ్డి కొన్ని సూచనలు చేశారని పేర్కొన్నారు.

పార్టీలో టికెట్లకు సంబంధించి ఒక విధానం ఉంటుంది: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర వేరేమార్గంలో... తన పాదయాత్ర మరో మార్గంలో ఉంటుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అరవై శాతం టిక్కెట్లు ఇప్పటికే ఖరారు అయ్యాయన్న విషయం తనకు తెలియదని వివరించారు. పార్టీలో టికెట్లకు సంబంధించి ఒక విధానం ఉంటుందని.. దాని ప్రకారమే టికెట్ల ఎంపికని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

రేవంత్‌రెడ్డి పాదయాత్రకు పిలవలేదు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండుటెండలో పాదయాత్ర చేయబోతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గతంలో వైఎస్‌ఆర్ పాదయాత్ర చేసిన సమయంలో దగ్గరగా చూసిన అనుభవం తనకు ఉందని వివరించారు. మండుటెండలో భట్టి పాదయాత్ర చేపడుతున్నారని.. అందుకే జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చానని తెలిపారు. పెద్ద పెద్ద సెంటర్లలో బహిరంగ సభలు పెట్టమని సూచించానని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు తనను పిలవలేదని వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

పాదయాత్రలో పాల్గొంటాను: ఈ పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంచిర్యాలతో పాటు జడ్చర్ల లేదా షాద్‌నగర్‌లో బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు భట్టి తెలిపారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నల్గొండలో కూడా బహిరంగ సభ పెట్టాలని కోరానని అన్నారు. వారు అందుకు ఒప్పుకున్నారని వివరించారు. ఆ తర్వాత నకిరేకల్, సూర్యాపేటలో కూడా మినీ పబ్లిక్ మీటింగ్ పెట్టమని కోరానని వెల్లడించారు.

పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని.. అందుకే శని, ఆదివారాలు తాను తప్పకుండా పాదయాత్రలో పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం గాంధీభవన్‌లో పార్టీ అనుబంధ విభాగాల ఛైర్మన్లు, జనరల్ సెక్రటరీలతో భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. పాదయాత్ర విజయవంతం కోసం 52 మంది కో-ఆర్డినేటర్‌లను ఆయన నియమించారు.

పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని.. అందుకే శని, ఆదివారాలు తాను తప్పకుండా పాదయాత్రలో పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం గాంధీభవన్‌లో పార్టీ అనుబంధ విభాగాల ఛైర్మన్లు, జనరల్ సెక్రటరీలతో భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. పాదయాత్ర విజయవంతం కోసం 52 మంది కో-ఆర్డినేటర్‌లను ఆయన నియమించారు.

"రేవంత్‌రెడ్డి ఓ పక్క పాదయాత్ర చేస్తున్నారు. ఈ రెండు కూడా పార్టీ తీసుకున్న నిర్ణయం. రాష్ట్రమంతా ఒకేసారి ఒక్కరే పూర్తి చేయలేరు. ఓ వైపు వారు.. మరోవైపు నేను పాదయాత్రలు చేపడుతున్నాం." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

"నేను భట్టి పాదయాత్రకు సహకరిస్తాను. పాదయాత్రలో పాల్గొనాలని వారు నన్ను ఆహ్వానించారు. నేను వారికి కొన్ని సలహాలు, సూచనలు చేశాను. వారు అందుకు సానుకూలంగా స్పందించారు. పీసీసీ అధ్యక్షుడు నన్ను పాదయాత్రకు రమ్మని ఆహ్వానించలేదు." - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ

ఇవీ చదవండి: భట్టి విక్రమార్క పాదయాత్ర.. 91 రోజులకు షెడ్యూల్ విడుదల

కేసీఆర్​ పాలనపై కిషన్​రెడ్డి ట్వీట్.. బీజేపీ సన్నాసులకు అర్థం కాదంటూ కేటీఆర్ కౌంటర్

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్.. NFCలో ఉద్యోగాలు.. వేలల్లో వేతనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.