ETV Bharat / state

కేసీఆర్​ పాలనపై కిషన్​రెడ్డి ట్వీట్.. బీజేపీ సన్నాసులకు అర్థం కాదంటూ కేటీఆర్ కౌంటర్

author img

By

Published : Mar 12, 2023, 11:34 AM IST

Kishan Reedy and KTR Tweet War: సోషల్​ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉండే మంత్రి కేటీఆర్​.. కేంద్రమంత్రి కిషన్​రెడ్డిల మధ్య ట్వీట్​ వార్​ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కిషన్​రెడ్డి ట్వీట్​ చేయగా.. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై మంత్రి కేటీఆర్​ అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు, విమోచన దినోత్సవానికి రాష్ట్రంలో సరైన గుర్తింపు లభించలేదని కిషన్​రెడ్డి ఆరోపించగా.. గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కాదని కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

kishan reddy vs ktr
కిషన్​రెడ్డి కేటీఆర్​

Kishan Reedy and KTR Tweet War: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్​ల మధ్య శనివారం ట్విటర్​ వేదికగా వార్ జరిగింది. కిషన్​రెడ్డి పెట్టిన ట్వీట్​కు కేటీఆర్ ఘాటుగా​ స్పందించడంతో ఇది మొదలైంది. అసలు విషయంలోకి వెళితే.. మిలియన్ మార్చ్​ను గుర్తు చేస్తూ మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. మిలియన్ మార్చ్​కు పుష్కరకాలం గడిచిందని తెలిపారు. కేసీఆర్ నియంతృత్వ పాలనలో కనీస గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి తప్ప, మిలియన్ మార్చ్​కు కారణమైన నేతలకు, ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు, విమోచన దినోత్సవానికి సరైన గుర్తింపు లభించలేదని ఆరోపించారు. ఉద్యమం పేరిట అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఉద్యమాలనే అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఆకాంక్షలను నీరు గార్చేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

ఉద్యోగ నియామకాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకొంటున్నారు: కోట్లాది ప్రజలు కొట్లాడితే.. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే కూర్చొని అధికారాన్ని చెలాయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. నాడు ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని నేడు పక్కన కూర్చోబెట్టుకొని ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రి ఆక్షేపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఉద్యోగ నియామకాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉందని, రైతులకు పరిహారం ఇవ్వకపోగా సంకెళ్లు వేసి బెదిరిస్తున్నారన్నారు. సొంత పార్టీలో మొదలు రాష్ట్ర వ్యాప్తంగా ఆడ బిడ్డలకు రక్షణ లేని పరిస్థితి ఉందని.. కేసీఆర్ పాలనలో రాష్ట్ర దౌర్భాగ్య స్థితి ఇది అని ఆక్షేపించారు. ఈ మేరకు కిషన్​రెడ్డి ట్వీట్​ చేశారు.

కేటీఆర్​ ట్వీట్​: కిషన్ రెడ్డి ట్వీట్​పై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దామంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. తల్లిని చంపి.. బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోదీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కాదని కేటీఆర్ ట్వీట్ చేశారు. 'మోదీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని.. పనికి వచ్చే పనులు చెయ్యండి' అని సూచించారు.

''తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం. తల్లిని చంపి.. బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోదీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కాదు. మోదీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని.. పనికి వచ్చే పనులు చేయండి.''-ట్విటర్​లో మంత్రి కేటీఆర్

  • తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయిన MLA ఎవరో చెప్పుకోండి చూద్దాం?

    తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్ధం కాదు

    మోడీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని… https://t.co/7JzGrxnpgw

    — KTR (@KTRBRS) March 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.