ETV Bharat / state

MMTS: నేటి నుంచి అందుబాటులోకి మరో 45 ఎంఎంటీఎస్‌ సర్వీసులు

author img

By

Published : Jul 1, 2021, 2:21 AM IST

నేటి నుంచి అందుబాటులోకి మరో 45 ఎంఎంటీఎస్‌ సర్వీసులు
నేటి నుంచి అందుబాటులోకి మరో 45 ఎంఎంటీఎస్‌ సర్వీసులు

ఇవాళ్టి నుంచి మరో 45 ఎంఎంటీఎస్​ సర్వీసులు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే 10 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తున్నాయని.. వాటికి అదనంగా మరో 45సర్వీసులు నడుపిస్తున్నామని అధికారులు తెలిపారు.

నేటి నుంచి మరో 45ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ నుంచి లింగంపల్లి మార్గంలో 12సర్వీసులు, లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు 12సర్వీసులు, ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వయా రామచంద్రాపురం 16సర్వీసులు, లింగంపల్లి రామచంద్రాపురం నుంచి ఫలక్‌నుమా వరకు 15 సర్వీసులు నడుస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది.

ఇప్పటికే 10 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తున్నాయని.. వాటికి అదనంగా మరో 45సర్వీసులు నడుపిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. కరోనా విస్తరణ నేపథ్యంలో గతంలో ఎంఎంటీఎస్​ సర్వీసులను నిలిపివేశారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం, రాష్ట్రంలో లాక్​డౌన్(Lockdown) ఎత్తివేయడంతో జూన్​ 23వ తేదీన 10 ఎంఎంటీఎస్​ రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఇప్పుడు కరోనా కేసులు ఇంకా తగ్గిపోవడం వల్ల మరో 45 సర్వీసులు పట్టాలెక్కనున్నాయి.

ఇదీ చదవండి: Zonal line clear: జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్రం ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.