ETV Bharat / state

300 మందికి సాయం చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ

author img

By

Published : Apr 20, 2020, 8:43 PM IST

A charity has helped 300 people in banjara hills hyderabad
300 మందికి సాయం చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ

లాక్​డౌన్​తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కార్మిక కుటుంబాలకు దాతలు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని బోలానగర్, ఖాజానగర్‌ కాలనీల్లో ఆక్టోపస్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 300 మందికి నిత్యావసరాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మీ హాజరయ్యారు.

హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పేదలకు ఆదుకునేందుకు ఆక్టోపస్ స్వచ్చంద సంస్థ ముందుకొచ్చింది. బంజారాహిల్స్‌లోని బోలానగర్, ఖాజానగర్‌లో కూలీలు, నిరుపేదలకు స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు.

సుమారు 300 మంది పేదలకు బియ్యం, పప్పులు, నూనెతోపాటు ఇతర సరకులు అందించారు. మరో 10 రోజుల పాటు నిరుపేదలకు సరకులు అందించనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ అనిరుద్‌ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్టోపస్ సంస్థ ముందుకొచ్చి పేదలకు ఆదుకోవడం సంతోషకరమని కార్పొరేటర్ అన్నారు. అందరూ భౌతిక దూరం పాటించి కరోనాను దూరం చేయాలని సూచించారు.

300 మందికి సాయం చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ

ఇదీ చూడండి : వందేళ్ల ప్రస్థానం గల బొగ్గు గని మూసివేత

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.