ETV Bharat / state

వందేళ్ల ప్రస్థానం గల బొగ్గు గని మూసివేత

author img

By

Published : Apr 20, 2020, 5:10 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి కాలరీస్ కంపెనీలో వంద సంవత్సరాల చరిత్ర గల 21 ఇంక్లైన్ భూగర్భ గని మూతపడింది. కాలపరిమితి ముగిసిన బొగ్గు గనుల జాబితాలో ఇటీవల సింగరేణి ప్రకటించిన వాటిలో ఈ గని కూడా ఉంది.

The 21 incline underground mine located in Bhadradri district has been closed.
వందేళ్ల ప్రస్థానం గల బొగ్గు గని మూసివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఉన్న 21 ఇంక్లైన్​ భూగర్భ గని మూతపడింది. ఆంగ్లేయుల కాలంలో ప్రారంభమైన ఈ గని అత్యధిక బొగ్గు ఉత్పత్తులు సాధించి ఎన్నో రికార్డులను కైవసం చేసుకుంది. ఇక్కడ పనిచేసిన ఎందరో... ఉన్నత పదవులను కాంక్షించి సింగరేణిలో డైరెక్టర్ల స్థాయికి ఎదిగారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తికి లక్షలాది టన్నుల బొగ్గును అందజేసింది. ఎంతో ఘన చరిత్ర గల ఈ గనిని మూసివేయవద్దని ఉద్యమాలు కూడా జరిగాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.