ETV Bharat / state

CORONA CASES: రాష్ట్రంలో తగ్గుతోన్న కొవిడ్​ ఉద్ధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..?

author img

By

Published : Feb 16, 2022, 2:46 AM IST

CORONA CASES: రాష్ట్రంలో తగ్గుతోన్న కొవిడ్​ ఉద్ధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..?
CORONA CASES: రాష్ట్రంలో తగ్గుతోన్న కొవిడ్​ ఉద్ధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..?

CORONA CASES: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 569 కేసులు నమోదవగా.. మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,379 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో గత 24 గంటల్లో 51,518 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 569 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,84,631కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

తాజాగా కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం మృతుల సంఖ్య 4,107కి చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 2,098 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,379 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి: AP Corona Cases: ఏపీలో కొత్తగా 615 కరోనా కేసులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.