ETV Bharat / state

క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటి మట్టం

author img

By

Published : Aug 19, 2020, 9:11 PM IST

godhavari flood lever decreasing at badrachalam
godhavari flood lever decreasing at badrachalam

గోదావరి ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం ఈ రోజు 44 అడగులకు చేరింది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్న అధికారులు... 43 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించుకోనున్నారు.

భద్రాచలంలో గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. రెండు రోజుల క్రితం 61.7 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గుతూ నిన్న మధ్యాహ్నానికి 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఈరోజు ఉదయం గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరగా... రెండో ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించుకున్నారు.

ఈరోజు సాయంత్రం గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరింది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు తగ్గితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకోనున్నారు. గోదావరి నీటిమట్టం తగ్గుతున్నప్పటికీ... ఏజెన్సీ మండలాలకు ఇంకా రాకపోకలు పునరుద్ధరింపబడలేదు. చాలా రహదారుల పైన ఒండ్రు మట్టి, కర్రలు నిలిచి ఉన్నాయి. మరికొన్ని చోట్ల వరద నీరు రహదారి పైనే ఉంది.

ఇదీ చూడండి : లంచం కేసులో అధికారుల కస్టడీకి అనిశా పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.