ETV Bharat / sports

సెంటీమీటర్​తో స్వర్ణం మిస్​.. షాలినికి రజతం

author img

By

Published : Aug 22, 2021, 10:04 PM IST

ఆదివారం జరిగిన అండర్​-20 ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో లాంగ్​ జంపర్​ షాలిని సింగ్​కు.. సెంటీమీటర్​ దూరంతో స్వర్ణం చేజారింది.​ ఫలితంగా రజత పతకంతో మెరిసింది.

shalini
షాలిని

భారత లాంగ్​ జంపర్​ షాలిని సింగ్ చరిత్ర సృష్టించే అవకాశానికి సెంటీమీటర్​ దూరంలో నిలిచిపోయింది. ఆదివారం జరిగిన అండర్​-20 ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో ఆమెకు స్వర్ణం తృటిలో చేజారింది. దీంతో రజతానికి పరిమితమైంది.

ఈ ఛాంపియన్​షిప్​ పోటీల్లో 17ఏళ్ల షాలిని 6.59మీటర్లు లాంగ్​ జంప్​ చేసింది. వ్యక్తిగతంగా ఇది ఆమెకు ఉత్తమ స్కోరు. అయితే స్వీడెన్​కు యూరోపియన్​ జూనియర్​ ఛాంపియన్​ మజా అస్కాగ్​ 6.60మీటర్ల దూరం దూకి గోల్డ్​ మెడల్​ సాధించింది. ఉక్రెయిన్​కు చెందిన మరియా 6.50మీటర్ల దూరం జంప్​ చేసి కాంస్యంను దక్కించుకుంది.

షాలిని.. భారత అథ్లెటిక్స్​లో స్టార్​గా ఎదుగుతుందని భావిస్తున్నారు క్రీడా విశ్లేషకులు. బెంగళూరులోని అంజు బాబీ జార్జ్​ అకాడమీలో శిక్షణ పొందుతుతున్న ఆమెకు.. బాబీ జార్జ్​ కోచ్​గా వ్యవహరిస్తున్నారు​. జూన్​లో జరిగిన నేషనల్​ ఇంటర్​ ఛాంపియన్​షిప్స్​లో 6.48మీటర్లు లాంగ్​ జంప్​ చేసింది. అండర్​-18లో వరల్డ్​ నెం.2, అండర్-20లో జాతీయ రికార్డు ఆమె పేరిట ఉంది.

ఇదీ చూడండి: పారాలింపిక్స్​కు భారత్​ నుంచి ఎంతమంది అంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.