ETV Bharat / sports

పారాలింపిక్స్​కు భారత్​ నుంచి ఎంతమంది అంటే..

author img

By

Published : Aug 22, 2021, 8:29 PM IST

paralympics contingent india
పారాలింపిక్స్​కు భారత్​ నుంచి ఎంతమంది అంటే..

భారత్​ తరపున టోక్యో పారాలింపిక్స్​లో 54 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్​ నుంచి ఇంత మంది పారాలింపిక్స్​కు వెళ్లడం ఇదే తొలిసారి. పతకాలే లక్ష్యంగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు.

టోక్యో పారాలింపిక్స్​లో భారత్​ తరపున 54 మంది ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. దేశం తరపున ఇంత మంది అథ్లెట్లు పారాలింపిక్స్​లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆర్చరీ, అథ్లెటిక్స్​, వెయిట్​లిఫ్టింగ్​ ఇలా మొత్తం 9 క్రీడలకు ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టార్గెట్​ ఓలింపిక్​ పోడియమ్​ స్కీమ్​లో భాగంగా క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఆటగాళ్లను ఎంపిక చేసింది.

ఈ పారాలింపిక్స్​లో దేవేంద్ర జజారియా, మరియప్పన్​ తంగవేలు వంటి స్టార్​ అథ్లెట్​లతో పాటు పలువురు తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో పారా షూటర్​ జ్యోతి బాలన్​ ఒకరు. టేబుల్​ టెన్నిస్​లో పతకం సాధించడమే లక్ష్యంగా గుజరాత్​కు చెందిన భవీనా పటేల్​, సోనాల్​ బెన్​ పటేల్ భారత్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీల్​ఛైర్​ క్లాస్​ 4, వీల్​ఛైర్​ క్లాస్​ 3 కేటగిరీలతో పాటు ఉమన్స్​ డబుల్స్​ ఆడేందుకు సన్నధం అయ్యారు.

తైక్వాండోలో భారత్​ తరపున హరియాణాకు చెందిన 21 ఏళ్ల అరుణా తన్వార్​ పాల్గొననుంది. అండర్​ 44 కేజీ కే44 కేటగిరీ కింద ఆమె బరిలోకి దిగనుంది. పవర్​ లిఫ్టంగ్​లో జైదీప్​, సకీనా ఖాతున్​ సత్తా చాటనున్నారు.

పతకాలు వచ్చే ఛాన్స్​ ఎక్కువే..

పారాలింపిక్స్​లో ఎఫ్​-52 కేటగిరీలో బరిలోకి దిగిన డిస్కస్​ త్రో అథ్లెట్​ వినోద్​ కుమార్​.. అదే కేటగిరీలో కొనసాగనున్నాడు. దీనిపై పారా అథ్లెటిక్స్​ ఛైర్​పర్సన్ సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్-​52లో కొనసాగడం వల్ల పతకం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నారు.

మరోవైపు జావలిన్​ త్రో అథ్లెట్ తేక్​చాంద్​..​ ఎఫ్-​54 కేటగిరీ నుంచి ఎఫ్-55కు రీక్లాసిఫై అయ్యాడు. కేటగిరీ మారడం వల్ల తేక్​చాంద్​కు పోటీ కష్టతరం అవుతుందని పారా అథ్లెటిక్స్​ ఛైర్​పర్సన్​ అభిప్రాయపడ్డారు. కానీ తేక్​చాంద్​ మెరుగైన ప్రదర్శనే చేస్తాడని ధీమా వ్యక్తం చేశారు.

అసలు ఏంటీ కేటగిరీలు?

పారాలింపిక్స్​లో ఆటగాడి వైకల్యం, సామర్థ్యానికి సమఉజ్జీవులుగా ఉన్న వారితోనే పోటీ నిర్వహించేందుకు ఈ కేటగిరీ పద్ధతిని ఏర్పాటు చేశారు. ట్రాక్​, మారథాన్​, జంపింగ్​కు సంబంధించిన క్రీడలను 'టీ' కేటగిరీగా గుర్తిస్తారు. ఫీల్డ్​కు సంబంధించిన క్రీడలకు 'ఎఫ్​' కేటగిరీగా గుర్తిస్తారు. సాధారణంగా కేటగిరీ సంఖ్య ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ వైకల్యం ఉన్నట్టు పరిగణిస్తారు.

అథ్లెట్లకు మొత్తం టీ/ఎఫ్​ 51, టీ/ఎఫ్​ 52, టీ/ఎఫ్​ 53, టీ/ఎఫ్​54, టీ/ఎఫ్​55, టీ/ఎఫ్​ 57 కేటగిరీలు ఉంటాయి.

ఇదీ చదవండి : Paralympics: వైకల్యాన్ని జయించి.. విశ్వ క్రీడలకు కదిలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.