ETV Bharat / sports

'నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి'.. రిటైర్మెంట్​పై​ మెస్సీ కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Feb 3, 2023, 2:57 AM IST

Lionel Messi retirement hint
Lionel Messi retirement hint

ఫిఫా వరల్డ్​కప్​ విజేత లియోనెల్​ మెస్సీ తన రిటైర్మెంట్​పై కీలక కామెంట్లు చేశాడు. తనకు జీవితంలో అన్నీ ఉన్నాయని.. అంతకు మించి ఇంకా ఏం కోరుకోవట్లేదని చెప్పాడు. దీంతో మెస్సీ త్వరలో రిటైర్మెంట్​ తీసుకోబోతున్నాడంటూ చర్చ మొదలైంది.

​స్టార్ ఫుట్​బాల్​ ప్లేయర్​ లియోనెల్​ మెస్సీ రిటైర్మెంట్​ ప్రకటించబోతున్నాడా? తన కెరీర్​కు ఫుల్​స్టాప్​ పెట్టబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. తాజాగా మెస్సీ చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిటైర్మెంట్​ గురించి ఓ హింట్​ ఇచ్చాడు మెస్సీ. కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తన జీవితంలో ఫిఫా వరల్డ్​ కప్​ గెలిచిన క్షణాలు అత్యద్భుతమని.. అంతకు మించి తాను ఏదీ కోరుకోవట్లేదని చెప్పాడు. "నా కేరీర్​లో, వ్యక్తిగతంగా కావాల్సివన్నీ ఉన్నాయి. నా కెరీర్​ను సరికొత్తగా ముగించాలనుకుంటున్నాను. నేను నా కెరీర్​ను మొదలు పెట్టినప్పుడు.. ఇలా జరుగుతుందని ఊహించలేదు. కానీ నాకు ఇది జరుగుతుండటం చాలా ఉత్తమం. మేము 2021లో కోపా అమెరికా కప్​, ఇటీవల సాకర్ వరల్డ్​ కప్​ను గెలుచుకున్నాము. ఇక మిగిలింది ఏమీ లేదు" అని చెప్పాడు.

ఈ స్టార్​ సాకర్​ ప్లేయర్​ కతార్​లో జరిగిన ఫిపా వరల్డ్​ కప్ 2022​లో అద్భుత ప్రదర్శన చేశాడు. అంతకుముందు కోపా అమెరికా, ఫైనలిస్సిమా గెలిచాడు. చాలా సార్లు ballon d'or అవార్డులను సొంత చేసుకున్నాడు. అయితే, ఇంతకుముందు 2016 మెస్సీ రిటైర్మెంట్​ ప్రకటించాడు. కొన్ని రోజల తర్వాత మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. కానీ మెస్సీ తాజాగా చేసిన వ్యాఖ్యలతో త్వరలోనే మెస్సీ రిటైర్మెంట్​ ప్రకటించబోతున్నాడంటూ చర్చనడుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.