ETV Bharat / sports

Olympics: సోషల్​మీడియా వల్ల అథ్లెట్లపై మానసిక ఒత్తిడి?

author img

By

Published : Jul 10, 2021, 5:26 PM IST

ఒలింపిక్స్​లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న భారత అథ్లెట్లపై సోషల్​మీడియా వల్ల మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోందని తెలిసింది!. అందుకే దానికి దూరంగా ఉండేందుకు మన క్రీడాకారులు ప్రయత్నిస్తున్నారట. ఎందుకంటే?

dutee chand
ద్యుతి చంద్​

ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్​(Tokyo Olympics) త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనే అథ్లెట్లకు శిక్షణ విషయంలోనే కాకుండా సోషల్​మీడియా వల్ల కూడా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది! ఎందుకంటే ఈ మెగాక్రీడల్లో భారత్​ చివరిసారిగా 2008లో స్వర్ణం సాధించింది. 10మీటర్ల ఎయిర్​ రైఫిల్ ఈవెంట్​ అభినవ్​ బింద్రా ఈ గోల్డ్​మెడల్​ను సాధించాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మన ప్లేయర్స్ ఎవరూ గోల్డ్ సాధించలేకపోయారు. దీంతో ఈ సారైనా మన అథ్లెట్లు స్వర్ణం అందుకుంటారని కోట్లాదిమంది ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సోషల్​మీడియా వేదికగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతోపాటే మరికొంతమంది ప్రతికూల కామెంట్లతో ఆటగాళ్లను నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు అభిమానుల అంచనాలకు చేరుకుంటామో లేదో అన్న అలోచనలతో క్రీడాకారులపై మానసికంగా ఒత్తిడి పెరుగుతోంది! ఈ నేపథ్యంలో వారు ఈ సోషల్​మీడియా ప్లాట్​ఫామ్​లకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు!

తానూ ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నానని ఒలింపిక్స్​కు(Tokyo Olympics) అర్హత సాధించిన భారత స్టార్ స్ప్రింటర్​ ద్యుతి చంద్​(Dutee chand) చెప్పింది. సోషల్​మీడియా చూస్తుంటే భయంగా ఉందని అంటోంది. తనపై మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుందని, అందుకే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడానికే చాలా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

"సాధారణంగా ఏం ఒత్తిడి అనిపించదు. కానీ సోషల్​మీడియా ప్లాట్​ఫామ్​లు ఇన్​స్టా, ట్విట్టర్​ తెరవగానే ఒత్తిడి ఎక్కవైపోతుంది. 'ద్యుతి ఓడిపోతుంది', 'ద్యుతి మీదే ఆశలు పెట్టుకున్నాం.. పతకం సాధిస్తుంది' ఇలా ఎన్నో కామెంట్లు చూస్తుంటే మానసికంగా ఒత్తిడికి పెరిగిపోతుంది. అందుకే సామాజిక మాధ్యమాలను చూడట్లేదు." అని ద్యుతి చెప్పింది. అయితే ద్యుతి మాత్రమే కాదు ఎంతోమంది అథ్లెట్లు ఇటీవలే పలు సందర్భాల్లో ఈ విధంగానే చెప్పుకొచ్చారు.

వెనకడుగు వేయలేదు

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్ వల్ల తన శిక్షణకు చాలా ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పింది ద్యుతి. అయినా తాను వెనకడుగు వేయలేదని.. ఒలింపిక్స్​కు అర్హత సాధించాలని పట్టుదలతో శ్రమించినట్లు వెల్లడించింది. కష్టాలు, సమస్యలు ఎప్పుడు వస్తుంటాయి, కానీ వాటిని అధిగమించి ఉత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తుండాలని చెప్పింది.

వీడియోలను చూస్తా..

తన ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూస్తానని చెప్పుకొచ్చింది ద్యుతి. అందులో తన తప్పులు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలించుకుని పునరావృతం కాకుండా సరిచేసుకుంటూ ఉంటానని తెలిపింది. మెదడును ఉల్లాసంగా ఉంచేందుకు పాటలు కూడా వింటానని చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. మెగాక్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసి సెమీఫైనల్స్​కు చేరుకోవడమే తన లక్ష్యమని తెలిపింది. ఇందుకోసం రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు ప్రాక్టీస్​ చేస్తున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: Olympics: ఆ ఘనతంతా వారిదే: ద్యుతిచంద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.