ETV Bharat / sports

అందులోనూ సాత్విక్​ జోడీ టాప్​.. సింధుకు మళ్లీ నిరాశే..

author img

By

Published : Jul 25, 2023, 12:51 PM IST

Satwik Chirag pair
Satwik Chirag pair

BWF Rankings 2023 : భారత స్టార్​ షట్లర్స్ సాత్విక్​-చిరాగ్​ జోడీ మరో అరుదైన రికార్డును అందుకుంది. ఇటీవలే కొరియా ఓపెన్ టైటిల్​ను ముద్దాడిన ఈ జోడీ.. తాజాగా విడుదలైన బీడబ్ల్యూఎఫ్ పురుషుల డబల్స్​ ర్యాంకింగ్స్​లోనూ మెరుగుపడింది.

BWF Rankings 2023 : ఇటీవలే జరిగిన కొరియా ఓపెన్​లో టైటిల్​ను కైవసం చేసుకున్న భారత షట్లర్స్​ సాత్విక్- చిరాగ్​ జోడీ ..తాజాగా మరో అరుదైన రికార్డును అందుకున్నారు. మంగళవారం విడుదలైన బీడబ్ల్యూఎఫ్ పురుషుల డబుల్స్​ ర్యాంకింగ్స్​లో ఈ జోడీ రెండో స్థానంలో నిలిచింది. గత వారం జరిగిన కొరియా ఓపెన్​ సెమీ ఫైనల్స్​లో ఓడిన చైనా జోడీ లియాంగ్ వీ కెంగ్ , వాంగ్ చాంగ్‌లను.. ఈ ర్యాంకింగ్స్​లో సాత్విక్​ జోడీ కిందకు నెట్టి ఎగబాకింది. ప్రస్తుతం సాత్విక్​ చిరాగ్​ జోడీ వద్ద 87,211 పాయింట్లు ఉన్నాయి.

మరోవైపు మహిళల సింగిల్స్​లో పీవీ సింధు మాత్రం గత వారంలాగే ఈ సారి కూడా 17వ స్థానానికే పరిమితమవ్వగా.. సైనా నెహ్వాల్ 37వ స్థానంలో నిలిచింది. ఇక పురుషుల సింగిల్స్​లో హెచ్‌.ఎస్ ప్రణయ్ 10వ స్థానంలో ఉండగా.. కెనడా ఓపెన్ విజేత లక్ష్య సేన్ ప్రపంచ 13వ ర్యాంక్‌కు పడిపోయాడు. మరోవైపు ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న కిదాంబి శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.