ETV Bharat / sports

ఐపీఎల్‌ 2024లోనూ మహీ ఆడతాడా? రైనా ఏం చెప్పాడంటే?

author img

By

Published : Mar 16, 2023, 5:33 PM IST

మరో కొన్ని రోజుల్లో ఐపీఎల్‌ 2023 సందడి ప్రారంభం కానుంది. ఈ సీజన్​ కోసం కెప్టెన్‌ కూల్ ఇప్పటికే ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. అయితే, ఇదే చివరి సీజన్‌ అవుతుందా..? లేదంటే వచ్చే ఏడాది కూడా ఆడతాడా..? అనేది అందరిలోనూ ఆసక్తి మొదలైంది. దీనిపై సురేశ్​ రైనా ఏమన్నాడంటే?

Dhoni IPL
ఐపీఎల్‌ 2024లోనూ మహీ ఆడతాడా? రైనా ఏం చెప్పాడంటే?

ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్​ ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి ఈ ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. గుజరాత్‌ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్​తో ఈ సీజన్ మెగా టోర్నీ షురూ కానుంది. అయితే ఐపీఎల్​ అనగానే గత రెండు సీజన్ల నుంచి ధోనీ ఈ మెగాటోర్నీకి వీడ్కోలు పలుకుతాడా అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు అతడు ఆడుతూనే ఉన్నాడు. కొంతకాలం క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు.. తాజా సీజన్​ కోసం ప్రాక్టీస్‌ను కూడా ప్రారంభించేశాడు. అయితే ఎప్పుటిలాగే ఈ 16వ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్‌కూ రిటైర్మెంట్​ ప్రకటిస్తాడనే ప్రచారం సాగుతోంది. క్రికెట్ విశ్లేషకులు కూడా ఇదే అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా ఇదే విషయాన్ని సురేశ్‌ రైనా దృష్టికి తీసుకెళ్లగా.. అతడు దీనిపై అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం రైనా లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో అతడు మాట్లాడుతూ.. మహీ వచ్చేసీజన్‌లోనూ తప్పకుండా ఆడతాడని స్పష్టతనిచ్చాడు.

"ఐపీఎల్ 2024 సీజన్‌లోనూ మహీ ఆడాలని కోరుకుంటున్నాను. అయితే, అతడి ఉద్దేశం ఏంటనేది మనకు క్లారిటీ లేదు. తెలీదు. అతడు బ్యాటింగ్‌ ఇంకా బాగానే చేస్తున్నాడు. ఫిట్‌నెస్‌లోనూ అతడు సూపర్​. అయితే, ఈ సీజన్​లో ధోనీ ప్రదర్శనపై.. వచ్చే సీజన్​లో ఆడాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఏడాది నుంచి ఆడని ధోనీకి సవాల్​ తప్పదు. అలాగే అంబటి రాయుడుకు కూడా. అయినా టీమ్​ ఇప్పటికే చాలా స్ట్రాంగ్​గా ఉంది. చాలా మంది య్ంగ్​ ప్లేయర్స్​ తామెంటో నిరూపించుకుంటున్నారు. డేవన్ కాన్వే, జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్, దీపక్ చాహర్, బెన్ స్టోక్స్.. ఇలా అనుభజ్ఞులు, యువకులతో కూడిన టీమ్ రెడీగా ఉంది. అయితే వారందరూ ఎలా ఆడతారో చూడాలి" అని రైనా చెప్పుకొచ్చాడు.

ఇప్పటికైతే మహీ ఫోన్‌లోనూ అందుబాటులో ఉండడని చాలా మంది క్రికెటర్లు అంటుంటారు. అయితే, తాను మాత్రం ధోనీతో టచ్‌లోనే ఉన్నట్లు రెనా పేర్కొన్నాడు. "నేను మహీ ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాం. ఇప్పుడు అతడు బాగా కఠినంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్​ సోషల్‌ మీడియాలోని వీడియోలను చూస్తే మీకే అర్థమవుతుంది. నెట్స్‌లో అదిరిపోయే భారీ షాట్లను బాదేస్తున్నాడు. ఇలానే మ్యాచ్‌లోనూ ఆడితే గెలపొందడం పక్కా" అని రైనా అన్నాడు.

ఇదీ చూడండి: సన్​రైజర్స్​ హైదరాబాద్​ న్యూ జెర్సీ చూశారా? కొత్తది బాగుందా.. పాతదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.