సన్​రైజర్స్​ హైదరాబాద్​ న్యూ జెర్సీ చూశారా? కొత్తది బాగుందా.. పాతదా?

author img

By

Published : Mar 16, 2023, 3:21 PM IST

Updated : Mar 16, 2023, 3:33 PM IST

Sunrisers Hyderabad new Jersy

సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఈ ఐపీఎల్​లో కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. మార్చి 16న కొత్త జెర్సీని లాంఛ్ చేసింది. అది ఆరెంజ్​ ఆర్మీ ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటోంది.

ఆరెంజ్ ఆర్మీ సన్​రైజర్స్​ హైదరాబాద్ ఈ ఐపీఎల్​ సీజన్​లో​ కొత్త జెర్సీతో దర్శనమివ్వనుంది. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కోసం సన్‌రైజర్స్ గురువారం(మార్చి 16) కొత్త జెర్సీని లాంఛ్​ చేసింది. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ తన అధికారిక సోషల్​మీడియా అకౌంట్​ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ కొత్త జెర్సీల్లో ఆ జట్టు ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ కనిపించి ఆకట్టుకున్నారు. ఈ కొత్త జెర్సీల ఫొటోలను పోస్ట్​ చేసిన సన్​రైజర్స్​.. "ఇది ఆరెంజ్ ఫైర్​. త్వరలోనే సన్​రైజర్స్​ ఈ కొత్త జెర్సీలో ఆడే మ్యాచులను చూడటానికి టికెట్లను ఇప్పుడే త్వరగా కొనుగోలు చేయండి" అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది.

ఈ కొత్త జెర్సీని చూస్తే.. పాత జెర్సీని పెద్దగా మార్పులు చేయకుండా.. కాషాయానికి ఇంకాస్త నల్లరంగును అద్ది.. రిలీజ్​ చేసింది. అలానే ఆరెంజ్ కలర్​లో ఉన్న ట్రాక్‌ ప్యాంటు కలర్​ను పూర్తి బ్లాక్ కలర్​గా మార్చింది. మొత్తంగా ఈ ఆరెంజ్‌ ఆర్మీ కొత్త జెర్సీని చూస్తుంటే.. సౌతాఫ్రికా తొలి టీ20 లీగ్‌లో ట్రోఫీని ముద్దాడిన సన్‌రైజర్స్ ఈస్టర్ కేప్​ జెర్సీలా ఉంది.

ఇకపోతే మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్​ ప్రారంభం కానుంది. ఏప్రిల్​ 2న సన్​రైజర్స్​ తమ తొలి మ్యాచ్​ను ఆడనుంది. ఈ మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​తో తలపడనుంది. ఈ పోరు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుంది. గత సీజన్​లో 14 మ్యాచ్​లు ఆడిన సన్​రైజర్స్​.. కేవలం ఆరింటిలో మాత్రమే గెలిచి, ఎనిమిది మ్యాచుల్లో ఓడిపోయింది. అలా పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది.

దీంతో ఈ సారి ఎలాగైనా గెలవాలని, మంచి పోటీనివ్వాలని సన్​రైజర్స్ ఆరాటపడుతోంది. గత సీజన్​లో కెప్టెన్​గా ఉన్న విలియమ్సన్​ను వదిలేసింది. ఈ సారి కొత్త కెప్టెన్​ ఏడెన్ మార్​క్రమ్​ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. ఇతడే సౌతాఫ్రికా లీగ్​లో సన్ రైజర్స్​కు చెందిన ఈస్టర్ కేప్​ను విజేతగా నిలిపాడు. అలా కొత్త కెప్టెన్​, కొత్త జెర్సీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇందులో భాగంగానే ఇటీవలే జరిగిన వేలంలోనూ మయాంక్​ అగర్వాల్​, ఇంగ్లాండ్​ యువ బ్యాటర్​ హ్యారీ బ్రూక్​ లాంటి వాళ్లను కొనుగోలు చేసింది. అలానే వేలం ప్రారంభానికి ముందు బ్రియాన్ లారాను హెజ్​ కోచ్​గా ఎంపిక చేసింది. దీంతో జట్టు మరింత బలపడింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసేన్, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, వివ్రాంత్ శర్మ, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, సమర్థ్ వ్యాస్, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగార్, అన్మోల్‌ప్రీత్ సింగ్, అకీల్ హుస్సేన్, ఏడెన్ మార్‌క్రమ్, అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, కార్తీక్ త్యాగి, ఫజల్ హక్ ఫరూకీ, టి. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్

Sunrisers Hyderabad new Jersy
సన్​రైజర్స్​ హైదరాబాద్ 2023 జెర్సీ
Sunrisers Hyderabad new Jersy
సన్​రైజర్స్​ 2022 సీజన్ జెర్సీ

ఇదీ చూడండి: మ్యాచ్​కు ముందే ఆర్సీబీకి షాక్​.. గాయం కారణంగా విల్​ జాక్స్ దూరం!

Last Updated :Mar 16, 2023, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.