ETV Bharat / sports

'ఫామ్​లోకి వచ్చావుగా'.. వార్నర్​పై సన్​రైజర్స్ కామెంట్స్

author img

By

Published : Dec 29, 2021, 10:56 AM IST

david warner SRH tweet, sunrisers on warner, డేవిడ్ వార్నర్ సన్​రైజర్స్, వార్నర్​కు ఎస్ఆర్​హెచ్ ప్రశంసలు
david warner

Warner SRH: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్​ను గత ఐపీఎల్ సీజన్​లో కెప్టెన్సీ నుంచి తప్పించింది సన్​రైజర్స్ హైదరాబాద్​. 2022 సీజన్ కోసం అతడిని రిటెయిన్ కూడా చేసుకోలేదు. తాజాగా యాషెస్ సిరీస్​లో వార్నర్ మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. దీనిపై స్పందిస్తూ ఎస్​ఆర్​హెచ్.. వార్నర్​ గురించి ఓ ట్వీట్ చేసింది.

Warner SRH: ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం సర్‌ప్రైజ్ ఇచ్చింది. యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకున్న కారణంగా వార్నర్‌కు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే ఐపీఎల్‌ మెగా వేలంలో అంతా మంచి జరగాలని ఆకాంక్షించింది. ఈ మేరకు ట్వీట్‌ చేయడం విశేషం.

ఇదీ జరిగింది

ఇటీవలే ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ ప్రధాన కోచ్‌గా టామ్‌ మూడీ మళ్లీ నియమితులయ్యాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం మంచి జట్టును ఎంచుకోవాలని ట్విట్టర్ వేదికగా మూడీకి ఓ అభిమాని సలహా ఇచ్చాడు. తప్పకుండా ప్రయత్నిస్తామని మూడీ సమాధానం ఇచ్చాడు. అయితే దీనిని ట్యాగ్‌ చేస్తూ డేవిడ్ వార్నర్‌ 'అది పెద్ద అనుమానమే' అని అర్థం వచ్చేలా స్పందించాడు. దీనికి ఎస్‌ఆర్‌హెచ్‌ రిప్లై ఇస్తూ.. "యాషెస్‌ గెలిచినందుకు కంగ్రాట్స్‌ డేవిడ్. చూస్తుంటే తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు ఉన్నావుగా. విజయం అనంతరం పార్టీని ఎంజాయ్‌ చేయ్‌. ఇదేకాకుండా మెగా వేలంలో నీకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం" అంటూ ట్వీట్‌ చేసింది.

ఐపీఎల్ 14వ సీజన్‌లో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించింది. యూఏఈ ఎడిషన్‌లో జట్టులో స్థానం కూడా కల్పించలేదు. దీంతో ఎస్ఆర్‌హెచ్, వార్నర్ మధ్య బంధం బీటలువారిందని చర్చకు తెరదీసింది. వార్నర్‌ను రిటెయిన్‌ చేసుకోకపోవడం.. తాను మెగా వేలంలోకి వెళ్తానని అతడు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.

ఇవీ చూడండి: ఇంగ్లాండ్ 68 ఆలౌట్.. మైఖేల్ వాన్​పై ట్రోల్స్ వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.