ETV Bharat / sports

అలా చేస్తే మహిళా క్రికెట్​కు తిరుగుండదు- WPL 2024లో ఆ మార్పు చేయాలి! : స్మృతి మంధాన

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 8:23 PM IST

Updated : Dec 5, 2023, 8:33 PM IST

Smriti Mandhana Comments On WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్​- డబ్ల్యూపీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది టీమ్ఇండియా స్టార్ బ్యాటర్, ఆర్​సీబీ కెప్టెన్ స్మృతి మంధాన. ఐపీఎల్​ లాగానే డబ్ల్యూపీఎల్​ను కూడా నిర్వహించాలని కోరింది. అప్పుడు మహిళా క్రికెట్ పురోగమిస్తుందని అభిప్రాయపడింది. ఇంకా ఏమందంటే?

Smriti Mandhana Comments On WPL 2024
Smriti Mandhana Comments On WPL 2024

Smriti Mandhana Comments On WPL 2024 : నాలుగు రోజుల్లో మహిళల ప్రీమియర్ లీగ్​- డబ్ల్యూపీఎల్ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు- ఆర్​సీబీ జట్టు సారథి స్మృతి మంధాన ఆ టోర్నీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్​ లాగే డబ్ల్యూపీఎల్ మ్యాచ్​లు జరగాలన్నారు. జోష్​తో ప్లేయర్లు ఆడే పరిస్థితులు కల్పించాలన్నారు. నిర్వాహకులు ఆ విధంగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.

"వివిధ నగరాల్లో డబ్ల్యూపీఎల్ 2024 మ్యాచ్‌లు జరగాలనేది నా కోరిక. అప్పుడు డబ్ల్యూపీఎల్‌ మరొక అడుగు ముందుకేసినట్లు అవుతుంది. నిర్వాహకులు ఆ దిశగా ఆలోచిస్తారని భావిస్తున్నాను. ఆర్‌సీబీ అభిమానిగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 'ఆర్‌సీబీ.. ఆర్‌సీబీ..' అంటూ అభిమానులు చేసే నినాదాల మధ్య ఆడటమంటే చాలా ఇష్టపడతా. ఇలాంటి వాతావరణం ఆటగాళ్లలో మరింత జోష్‌ తెప్పిస్తుంది. ఇప్పటికే మహిళా క్రికెట్‌ చాలా పురోగతి సాధించింది. మల్టీ సిటీ ఫార్మాట్‌లో (ఇంటా, బయటా) మ్యాచ్‌లను నిర్వహిస్తే కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకొనే వీలు ఉంటుంది."
--స్మృతి మంధాన, ఆర్​సీబీ కెప్టెన్

డబ్ల్యూపీఎల్ వేలానికి ముందు ఆర్‌సీబీతో సమయం గడపడం వల్ల జట్టు ప్రాధాన్యాలేమిటో తనకు తెలిసిందని స్మృతి మంధాన తెలిపింది. జుట్టులోంచి ఏ ప్లేయర్​ను రిలీజ్​ చేయాలి. ఏ ప్లేయర్​ను అట్టి పెట్టుకోవాలి? అనే విషయాలపై స్పష్టత వచ్చిందని చెప్పింది. డబ్ల్యూపీఎల్‌ వేలంలో తప్పకుండా అత్యుత్తమ ప్లేయర్లను తీసుకోవడానికి ప్రయత్నిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.

భారత్​లో మహిళా క్రికెట్​ సాధించిన పరోగతి గురించి కూడా మాట్లాడింది స్మృతి మంధాన. 'భారత్‌లో మహిళలు క్రీడల్లో సత్తా చాటుతున్నారు. క్రికెట్‌లో ఇప్పటికే కామన్‌వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించింది టీమ్ఇండియా. గత పది సంవత్సరాల నుంచి మెన్స్​ క్రికెట్‌తో పోలిస్తే మహిళా క్రికెట్‌ కూడా వృద్ధి చెందింది. చిన్న గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన ఎంతోమంది మహిళలు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం' అని స్మతి చెప్పింది. మహిళా ప్లేయర్లకు ప్రోత్సాహం ఇస్తే తప్పకుండా ఫ్యూచర్​ మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. డిజిటల్‌ హక్కులు, టికెట్ల విక్రయాలతో ఆదాయం కూడా భారీగానే ఆర్జించే అవకాశం ఉందిని స్మృతి మంధాన అభిప్రాయపడింది.

రిలేషన్​షిప్​ స్టేటస్​పై స్పందించిన పీవీ సింధు- 'లవ్​ లైఫ్​' గురించి క్లారిటీ!

'మూడు మ్యాచులకే అంతగా అలసిపోయాడా? ఇంకెంత కాలం అతడ్ని​ పక్కన పెడతారు'

Last Updated : Dec 5, 2023, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.