ETV Bharat / sports

'మూడు మ్యాచులకే అంతగా అలసిపోయాడా? ఇంకెంత కాలం అతడ్ని​ పక్కన పెడతారు'

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 11:47 AM IST

Ishan Kishan Australia Series : ఇటీవలే భారత్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్​లో ఇషాన్ కిషన్​ను మొదటి మూడు మ్యాచుల్లో ఆడించి ఆ తర్వాత పక్కన పెట్టారు. ఈ తీరును టీమ్​ఇండియా మాజీ ప్లేయర్​ అజయ్​ జడేజా తప్పుపట్టాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే ?

Ishan Kishan Australia Series
Ishan Kishan Australia Series

Ishan Kishan Australia Series : టీమ్​ఇండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్​ను ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు మ్యాచ్​లకు పక్కన పెట్టడం పట్ల మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇషాన్​కు పదే పదే అన్యాయం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బీసీసీఐ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్​లో ప్రతిభావంతుడైన ఆటగాడు ఉన్నాడని, తనదైన రోజున అతడు జట్టును భుజాన మోస్తాడని చెప్పారు. అలాంటి ఆటగాడికి తగినన్ని అవకాశాలను కల్పించి జట్టులో కుదురుకునేందుకు సమయం ఇవ్వాలని సూచించాడు. అయితే, బీసీసీఐ తీరు మాత్రం ప్లేయర్ల సెలక్షన్​పై కాకుండా జట్టులో నుంచి ఎవరిని తప్పించాలన్న విషయంపైనే ఉంటుందని జడేజా మండిపడ్డారు.

"వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడారు. అయితే ఇషాన్ కిషన్ మాత్రం మూడు మ్యాచ్​లు ఆడి ఇంటికెళ్లిపోయాడు. అతడు మూడు మ్యాచులకే అంతగా అలసిపోయాడా? వరల్డ్ కప్​లోనూ అతన్ని సరిగా ఆడించలేదు. ప్రపంచ కప్​లో జరిగిన మ్యాచుల్లోనూ అతడికి అవకాశం ఇవ్వాల్సింది. తనదైన రోజు ఎంతమంది ఇండియన్ క్రికెటర్లు వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు? అతడు మ్యాచ్​లను ఒంటిచేత్తో మార్చేయగలడు. అతడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు? ఎన్ని రోజులు ఇలా అతన్ని ట్రయల్లో వాడుకుంటారు? గత రెండేళ్లలో అతడు ఆడిన మ్యాచులు ఎన్ని? ఇండియన్ క్రికెట్​లో ఈ సమస్య ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో వీళ్లు ప్లేయర్లను సెలక్ట్​ చేయట్లేదు రిజక్ట్ చేస్తారంతే" అని జడేజా అన్నాడు.

ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 టోర్నీలో మూడు మ్యాచ్​లు ఆడాడు ఇషాన్ కిషన్. అందులో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఒక మ్యాచ్​లో మాత్రం డకౌట్​గా వెనుతిరిగాడు. వైజాగ్​లో జరిగిన మ్యాచ్​లో 39 బంతుల్లో హాఫ్​ సెంచరీ మార్క్ (58)​ దాటాడు. ఇక ఆ తర్వాత తిరువనంతపురం వేదికగా జరిగిన పోరులో కేవలం 32 బంతుల్లోనే 52 రన్స్​ స్కోర్ చేశాడు. మరోవైపు​ మూడు ఇన్నింగ్స్​లోనూ 110 పరుగులు స్కోర్​ చేశాడు.

నన్ను నేనే అలా ప్రశ్నించుకునేవాడిని- అదే ఇప్పుడు సాయం చేసింది : ఇషాన్‌ కిషన్‌

ఇషాన్ భారీ తప్పిదం - మ్యాచ్​లో టర్నింగ్ పాయింట్ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.