ETV Bharat / sports

పెళ్లి విషయంలో ఫెయిల్ అయ్యాను.. హెచ్​ఐవీ టెస్ట్​ చేసుకున్నాను: ధావన్​

author img

By

Published : Mar 27, 2023, 4:55 PM IST

తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయిన విషయంపై క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ మాట్లాడాడు. పెళ్లి విషయంలో తాను ఫెయిల్ అయినట్లు చెప్పుకొచ్చాడు. హెచ్​ఐవీ టెస్ట్​ చేయించుకున్నట్లు గుర్తుచేసుకున్నాడు.

Dhawan
పెళ్లి విషయంలో ఫెయిల్ అయ్యాను.. హెచ్​ఐవీ టెస్ట్​ చేసుకున్నాను: ధావన్​

టీమ్ఇండియా సీనియర్​ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. అలాగే ఫ్యాషన్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తాడు. శరీరంపై డిఫరెంట్​ టాటులు కూడా వేయించుకుంటాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు తన పర్సనల్​ లైఫ్​కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్​ విషయాలను తెలిపాడు. తాను మొదటి టాటూ ఎప్పుడు వేయించుకున్నాడో.. ఆ టాటూ వల్ల ఎదురైన ఇబ్బందులను చెప్పాడు. రాజకీయాల్లోకి వస్తాడా లేదా అనేది కూడా వెల్లడించాడు.

"నాకు 15 ఏళ్లు ఉన్న సమయంలో ఫ్యామిలీతో కలిసి మనాలి పర్యటనకు వెళ్లాను. అప్పుడు వారికి తెలియకుండా వీపుపై ఓ టాటూను వేయించుకున్నాను. ఈ విషయాన్ని దాదాపు 3-4 నెలల పాటు ఎవరికీ తెలియకుండా దాచాను. ఆ తర్వాత ఒకరోజు మా నాన్నకు ఈ విషయం తెలిసిపోయి నన్ను బాగా కొట్టేశారు. నిజానికి టాటూ వేయించుకున్న తర్వాత నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఆ సూదితో అతడు ఎంతమందికి ఆ టాటూలు వేశాడో తెలీదు కదా. దాంతో నేను హెచ్‌ఐవీ టెస్టు కూడా చేయించుకున్నాను. నెగటివ్​ రిపోర్ట్​ వచ్చింది(నవ్వుతూ)" అని శిఖర్ ధావన్‌ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర వస్తున్న నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తారా అని అడగగా.. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవని చెప్పాడు. భవిష్యత్తులో ఛాన్స్​ వస్తే రాజకీయాల్లోకి వస్తానని తెలిపాడు. "ప్రస్తుతం నాకు అలాంటి ఆలోచనలు లేవు. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్లాలని రాసిపెట్టుంటే తప్పకుండా అది జరుగుతుంది. నేను ఏ రంగంలో ఉన్న 100 శాతం సమర్థంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తుంటాను. కచ్చితంగా సక్సెస్​ అవుతానని తెలుసు. నేను నా 11 ఏళ్ల వయసు నుంచి కష్టపడి పనిచేస్తున్నా. పాలిటిక్స్ వెళ్లే విషయంపై నేను ఇప్పటివరకూ ఎవరితోనూ మాట్లాడలేదు. నేను ఈ రాజకీయాల్లోకి రావాలని దేవుడు సంకల్పిస్తే తప్పకుండా సక్సెస్​ అవుతాను" అని ధావన్‌ వివరించాడు.

ప్రస్తుతం ధావన్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్​ 2023 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సీజన్​లో పంజాబ్ కింగ్స్ కు నాయకత్వం వహించనున్నాడు. మయాంక్ అగర్వాల్ స్థానంలో అతడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది పంజాబ్​ టీమ్​. ప్రస్తుతం గబ్బర్​ తమ హోం గ్రౌండ్ మొహలీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇకపోతే పంజాబ్.. తమ తొలి మ్యాచ్​ను ఏప్రిల్ 1న కోల్​కతా నైట్ రైడర్స్​తో తలపడనుంది.

అంతకుముందు ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. "పెళ్లి విషయంలో నేను ఫెయిల్ అయ్యాను. ఈ విషయంలో నేను ఎవరినీ నిందించలేను. ఎందుకంటే నేను పర్సనల్​గా తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పుడు క్రికెట్‌ గురించి నేను మాట్లాడే విషయాలు.. 20 ఏళ్ల క్రితం నాకు తెలిసి ఉండేవి కావు. ఏదైనా ఎక్స్​పీరియన్స్​తోనే వస్తుంది" అని ధావన్‌ వివరించాడు.

ఇదీ చూడండి: ఆనంద్​ మహీంద్రా చేసిన పనితో నిఖత్​ జరీన్ ప్లాన్​​ ఛేంజ్​​.. ఇక అలా చేయబోతుందట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.