ETV Bharat / sports

సంజూ బ్యాడ్​లక్​.. గాయంతో టీ20 సిరీస్​కు దూరం.. అతడి ప్లేస్​లో​ మరో ప్లేయర్​..

author img

By

Published : Jan 5, 2023, 11:02 AM IST

sanju samson out of t20
sanju samson

లంకతో మంగళవారం జరిగిన టీ20 మ్యాచ్​లో సంజూ శాంసన్​ మోకాలికి గాయమైంది. దీంతో అతడు మిగతా టీ20 మ్యాచ్​లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మరొక ప్లేయర్​ను బీసీసీఐ ఎంచుకుంది. అతడు ఎవరంటే ?

టీమ్ఇండియా క్రికెటర్​ సంజూ శాంసన్​ను మరోసారి దురదృష్టం వెంటాడింది. మంగళవారం శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో బౌండరీ లైన్​ దగ్గర ఫీల్డింగ్ సమయంలో అతడి ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో శ్రీలంకతో జరిగే మిగిలిన టీ20 మ్యాచ్​లకు దూరమయ్యాడు. ఇంతలోనే అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో ప్లేయర్​ను బీసీసీఐ ఎంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలా తెరపైకి జితేశ్​ శర్మ పేరు వచ్చింది. బుధవారం ఈ వార్తను ధ్రువీకరిస్తూ స్వయంగా బీసీసీఐ ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. దీంతో అందరి చూపు ఇప్పుడు జితేశ్​పై పడింది.

ఎవరీ జితేశ్​ శర్మ ?
ఐపీఎల్​ పంజాబ్​ జట్టులో కీలక ప్లేయర్​గా ఉన్న జితేశ్​ ఒకప్పుడు ముంబయి టీమ్​ మెంబర్​. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్​లో అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్​ తొలి మ్యాచ్​లోనే 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఈ 27 ఏళ్ల వికెట్ కీపర్​ కమ్​ బ్యాటర్ పంజాబ్​ తరఫున ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 10 ఇన్నింగ్స్​లో 234 పరుగులు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.