ETV Bharat / sports

సెంచరీ తర్వాత సంజూ సూపర్ సెలబ్రేషన్​ - వారికి స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చాడుగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 7:21 AM IST

Updated : Dec 22, 2023, 7:49 AM IST

Sanju Samson Century Celebration
Sanju Samson Century Celebration

Sanju Samson Century Celebration : సౌతాఫ్రికా సిరీస్​లో భాగంగా జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా విజయకేతనం ఎగురవేసింది. అయితే ఇందులో కీలక పాత్ర పోషించిన సంజూ తన సెంచరీ మార్క్​ దాటిన సమయంలో దాన్ని విన్నూత్నంగా సెలబ్రేట్​ చేసుకున్నాడు. అది ఎలా అంటే ?

Sanju Samson Century Celebration : తాజాగా జరిగిన సౌతాఫ్రికా సిరీస్​ మూడో వన్డేలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్​ సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగాడు. ఎంతో కాలం తర్వాత భారత జట్టు నుంచి పిలుపును అందుకున్న ఈ స్టార్​ ప్లేయర్​, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 114 బంతుల్లో 108 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఆ తర్వాత 110 బంతుల్లో సెంచరీ సాధించాడు. అలా తనపై ట్రోల్స్​ చేసిన వారికి తన బ్యాట్​తో సమాధానం చెప్పాడు.

అయితే సెంచరీ మార్క్ అందుకున్నాక సంజూ శాంసన్ తనదైన స్టైల్​లో సంబరాలు చేసుకున్నాడు. తన బైసెప్స్‌ను డగౌట్‌ వైపు చూపిస్తూ ధీమా వ్యక్తం చేశాడు. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

మరోవైపు సంజూ అభిమానులు తన కమ్​బ్యాక్​ చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎంతో కాలంగా దీనికోసం ఎదురుచూస్తున్నామని ఇప్పటికైనా తనకు ఈ అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

గత కొంత కాలంగా సంజూకు సరైన అవకాశాలు రావట్లేదు. ఒకటి రెండు మ్యాచ్‌లు తప్ప అతడు ఆడేందుకు పెద్దగా ఛాన్స్​ దొరకలేదు. అయితే ఆ బాధలన్నింటినీ దిగమింగుకుని ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ అదరగొట్టాడు. తన ఇన్నింగ్స్​లో స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించి జట్టును ఆదుకున్నాడు.

India Vs South Africa 3rd ODI : ఇక మ్యాచ్ విషయానికి వస్తే ​ ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు స్కోర్​ చేసింది. ఇక సంజూతో పాటు తిలక్ వర్మ(52) కూడా ఈ మ్యాచ్​లో రాణించాడు. యంగ్​ సెన్సేషన్​ రింకూ సింగ్​ కూడా తన బ్యాట్​కు పని చెప్పి 38 పరుగులతో దూకుడుగా ఆడాడు.

  • Sanju Samson gets a well deserved maiden century 👏🏻 as he plays extremely well helping India reach to a respectable total with Tilak Varma 🤝🏻 a great innings to watch,he really made ur count as he got his maiden 100 🔥#SAvIND | #SanjuSamson |#INDvSA

    pic.twitter.com/XNM5K72l65

    — ishaan (@ixxcric) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు ఈ మ్యాచ్​లో అరంగేట్ర ఆటగాడు రజత్ పాటిదార్ కూడా మెరుపు వేగంతో ఆడాడు.చివర్లో రింకూ సింగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో బ్యూరన్ హెండ్రిక్స్(3/63) మూడు వికెట్లు తీయగా, నండ్రె బర్గర్ రెండు వికెట్లు పడగొట్టాడు. లిజా విలియమ్స్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్ చెరో వికెట్ తీసారు.

శతక్కొట్టిన సంజూ - మూడో వన్డేలో భారత్‌ విజయం - సిరీస్​ మనదేరా

చెన్నై కెప్టెన్సీని రిజెక్ట్​ చేసిన సంజూ ? వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అశ్విన్​

Last Updated :Dec 22, 2023, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.