ETV Bharat / sports

Rohit Sharma Cricket Academy : అమెరికాకు పయనమైన హిట్​మ్యాన్​.. ఆ ప్లేస్​లో అకాడమీ ఓపెనింగ్​..

author img

By

Published : Aug 6, 2023, 12:57 PM IST

Updated : Aug 6, 2023, 1:35 PM IST

Rohit Sharma Cricket Academy : వెస్టిండీస్ పర్యటన ముగించుకున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వ్యక్తిగత వ్యాపారాల నిమిత్తం అమెరికా వెళ్లాడు. తాజాగా తన క్రికెట్ అకాడమీ 'క్రిక్ కింగ్​డమ్​'ను రోహిత్ అమెరికాలో ప్రారంభించాడు.

Rohit Sharma Cricket Academy
అమెరికాలో రోహిత్ క్రికెట్ అకాడమీ

Rohit Sharma Cricket Academy : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్​లోనే కాదు బిజినెస్​లోనూ రాణిస్తున్నాడు. ఇటీవలే వెస్టిండీస్ పర్యటన ముగించుకున్న రోహిత్ తాజాగా ఓ క్రికెట్​ అకాడమీ ఓపెన్​ చేసేందుకు అమెరికా పయనమయ్యాడు. దేశంలో అత్యంత పేరుగాంచిన 'క్రిక్ కింగ్​డమ్' అనే క్రికెట్ అకాడమీలో అతడికి భాగస్వామం ఉంది. ఈ క్రమంలో తన అకాడమీని విస్తరించాలని భావించిన హిట్​మ్యాన్​.. శనివారం అమెరికాలో కూడా 'క్రిక్ కింగ్​డమ్'ను తన భాగస్వాములతో కలిసి లాంఛ్ చేశాడు. ఈ విషయాన్ని రోహిత్ స్వయంగా తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశాడు.

Crickingdom Branches : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​కు​ క్రేజ్ పెరుగుతోంది. ఇటీవలె అమెరికాలో జరిగిన 'మేజర్ లీగ్ క్రికెట్' (ఎంఎల్​సీ) ఇందుకు తాజా నిదర్శనం. ఈ ఎమ్​ఎల్​సీ సూపర్ సక్సెస్ అవ్వడం వల్ల అమెరికాలో కూడా క్రికెట్ అకాడమీలు పుట్టుకొస్తున్నాయి. దీంతో రోహిత్ కూడా తన క్రికెట్ అకాడమీని యూఎస్​ఏలో ప్రారంభించాడు. కాగా ఇప్పటికే 'క్రిక్ కింగ్​డమ్' అకాడమీ భారత్ సహా, సింగపూర్, జపాన్​లో ఉండగా.. తాజాగా అమెరికాలో ప్రారంభించారు. ఇక త్వరలో బంగ్లాదేశ్​లోనూ ఈ అకాడమీని ప్రారంభించనున్నట్లు 'క్రిక్ కింగ్​డమ్' కో ఓనర్ సూర్యవంశీ చేతన్ వెల్లడించారు.

Rohit Sharma Endorsement : కాగా రోహిత్ ఇప్పటికే అడిడాస్, మ్యాగీ, ఒప్పో, నిస్సాన్​, గ్లెన్​మార్క్, అరిస్టోకార్ట్, ఐఐఎఫ్​ఎల్ ఫైనాన్స్, హైలాండర్ గార్మెంట్స్, రెలీ స్ర్పే, సియేట్, డ్రీమ్ 11, జియో, హుబ్లాట్ వాచెస్, ఓక్లే వంటి పలు బ్రాండ్​లతో ఎండార్స్​మెంట్స్ కలిగి ఉన్నాడు.

Rohit Sharma Bcci Contract : ఇక రోహిత్ బీసీసీఐ ఏ+ కాంట్రక్ట్ గ్రేడ్​లో కొనసాగుతున్నాడు. అయితే ప్రస్తుత టీమ్ఇండియా జట్టులోని ముగ్గురు ప్లేయర్లు (రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్​ప్రీత్ బుమ్రా) మాత్రమే ఏ+ గ్రేడ్​లో కొనసాగుతున్నారు. ఈ గ్రేడ్​ ప్లేయర్లకు బీసీసీఐ ఏటా రూ. 7 కోట్లు చెల్లిస్తోంది. అటు ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ గత రెండు సీజన్​ల నుంచి రోహిత్​కు రూ. 16 కోట్లు చెల్లిస్తోంది.

Last Updated : Aug 6, 2023, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.