ETV Bharat / sports

మేజర్​ లీగ్​ క్రికెట్ ఛాంపియన్​గా న్యూయార్క్ MI.. పూరన్​ విధ్వంసకర ఇన్నింగ్స్​.. కానీ ఏం లాభం!

author img

By

Published : Jul 31, 2023, 2:01 PM IST

Major League Cricket Final : ఐపీఎల్​లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్​. తాజాగా ఈ ఫ్రాంచైజీ మేజర్​​ లీగ్​​ క్రికెట్​-2023లో సత్తా చాటింది. అమెరికా నిర్వహించే ఈ లీగ్​ తొలి ఎడిషన్​లో ఎమ్ఐ న్యూయార్క్​ జట్టు ఘన విజయం సాధించి ఛాంపియన్​గా నిలిచింది. ఎమ్​ఐ ఆటగాడు నికోలస్​ పూరన్​ విధ్వంసకర ఇన్నింగ్స్​తో శతక్కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ అతడి ఇన్నింగ్స్​ రికార్డుల్లో నమోదు కాదు. ఎందుకంటే?

Nicholas Pooran Major League Cricket
Nicholas Pooran Major League Cricket

Major League Cricket 2023 : ఐపీఎల్​లోనే కాదు.. అమెరికా నిర్వహించే మేజర్ లీగ్​ క్రికెట్​ -2023 టోర్నీలో కూడా ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ అప్రతిహతంగా దూసుకెళ్తోంది. తాజాగా జరిగిన ఎమ్​ న్యూయార్క్​ జట్టు మేజర్​ లీగ్​ క్రికెట్​- 2023 తొలి ఎడిషన్​లో విజేతగా నిలిచింది. డల్లాస్​ వేదికగా సీటెల్‌ ఓర్కాస్‌ జట్టుతో జరిగిన తుది పోరులో ఎమ్​ఐ బ్యాటర్​ నికోలస్​ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 249.09 స్ట్రైక్‌రేటుతో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. 55 బంతుల్లో 137 పరుగులు చేసి శకక్కొట్టాడు. దీంతో ఫైనల్​ పోరులో సీటెల్​ ఓర్కాస్​పై 7 వికెట్ల తేడాతో ఎమ్​ఐ విజయం సాధించి ఛాంపియన్​గా నిలిచింది.

MI New York Final : 184 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎమ్​ఐ మొదటి ఓవర్లోనే మొదటి వికెట్​ కోల్పోయింది. ఓపెనర్​ స్టీవెన్​ టేలర్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్​ శయన్ జహంగీర్​ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో ఎమ్​ఐ న్యూయార్క్​ జట్టు పీకల్లోతి కష్టాల్లో కూరుకుపోయింది. అప్పుడొచ్చిన నికోలస్​ పూరన్​.. మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఎమ్​ఐ లక్ష్యాన్ని ఛేదించింది. సీటెల్​ ఓర్కాస్​ బౌలర్లలో ఇమాద్​ వాసిం, పార్నెల్​ ఒక్కో వికెట్​ పడగొట్టారు.

MI New York Vs Seattle Orcas : అంతకుముందు టాస్​ గెలిచిన ఓడి బ్యాటింగ్​కు దిగిన సీటెల్​ ఓర్కాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేశారు. ఓపెనర్​ డికాక్​ (87) అద్భుత ప్రదర్శన చేశాడు. సుభ్​మన్​ రంజనే (29), ప్రిటోరిస్ (21), ఎస్​ జయసూర్య (16) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఇక మిగతా వారంతా సింగిల్​ డిజిట్​ స్కోరుకో పెవిలియన్ చేరారు. ఇక ఎమ్​ఐ బౌలర్లలో బౌల్ట్, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్ల చొప్పున పడగొట్టారు. స్టీవెన్ టైలర్, వీస్​ ఒక్కో వికెట్​ తీశారు.

పనికిరాని పూరన్​ రికార్డులు!
Nicholas Pooran Major League Cricket : నికోలస్​ పూరన్​ అద్భుత ప్రదర్శనను ఓ మరుపురాని ఇన్నింగ్స్​గా గుర్తుంచుకోవమే. దాని వల్ల అతడికి ఏ ఉపయోగం లేదు. ఈ ఇన్నింగ్స్​కు రికార్డుల్లో ఎలాంటి స్థానం ఉండదు. ఎందుకంటే ఈ లీగ్‌ను అమెరికా నిర్వహిస్తోంది. అయితే, యూఎస్‌ ప్రస్తుతం అసోసియేట్‌ మెంబర్‌గానే ఉంది. ఇంటర్నేషనల్​ క్రికెట్ కౌన్సిల్​ నిబంధనల ప్రకారం.. మేజర్‌ క్రికెట్‌ లీగ్‌- ఎమ్​ఎల్​సీకి అధికారిక టీ20ల్లో అధికారిక హోదా లేదు.
Major League Cricket Teams : ఈ లీగ్​ జులై 13న మొదలైంది. ఈ ఎమ్ఎల్​సీలో లాస్‌ ఏంజెలెస్ నైట్​రైడర్స్‌, ఎమ్​ఐ న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, సీటెల్‌ ఓర్కాస్‌, టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌, వాషింగ్టన్‌ ఫ్రీడమ్​ పేరిట ఆరు టీమ్‌లు పోటీపడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.