ETV Bharat / sports

Pakistan Team Kolkata Biryani : హోటల్‍లో డిన్నర్​కు పాక్​ టీమ్​ నో.. 'జామ్​ జామ్​'లో బిర్యానీ ఆర్డర్!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 5:22 PM IST

Updated : Oct 31, 2023, 5:38 PM IST

Pakistan Team Kolkata Biryani : హోటల్​లో డిన్నర్​ వద్దనుకుని బయట నుంచి ఆహారం ఆర్డర్​ చేశారు పాకిస్థాన్ జట్టు ప్లేయర్లు. బంగ్లాదేశ్​తో మ్యాచ్​ సందర్భంగా కోల్​కతా చేరుకున్న పాక్​ ఆటగాళ్లు.. సిటీలోని ఓ ఫేమస్ రెస్టారెంట్​ నుంచి బిర్యానీ, కబాబ్స్​ తదితర ఆహార పదార్థాలను ఆర్డర్​ చేశారు.​

Pakistan Team Kolkata Biryani
Pakistan Team Kolkata Biryani

Pakistan Team Kolkata Biryani : 2023 వరల్ట్​ కప్​లో పాకిస్థాన్ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్​ల్లో రెండింట్లో విజయం సాధించి విమర్శలు పాలైంది. మరోవైపు పాకిస్థాన్​ క్రికెట్​లో కూడా ముసలం మొదలైంది. అంతేకాకుండా వాట్సాప్​ చాట్​ లీక్​ వల్ల బాబర్​ అజామ్​ కూడా వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్లేయర్స్​ చేసిన మరో పనితో పాక్​ జట్టు విమర్శల పాలైంది. పాకిస్థాన్​ ప్లేయర్లు హోటల్​లో డిన్నర్​కు నో చెప్పి.. బయట నుంచి ఆహారం ఆర్డర్​ చేసుకున్నారు.

Pakistan Team Refuses Dinner : మంగళవారం (అక్టోబర్ 31న) బంగ్లాదేశ్​తో మ్యాచ్​ సందర్భంగా కోల్​కతా చేరుకున్న పాక్​ టీమ్​ ఓ హోటల్​లో బస చేసింది. ఆదివారం సాయంత్రం హోటల్​లో డిన్నర్​ వద్దనుకుని.. ఓ ఆన్​లైన్ ఫుడ్​ డెలివరీ యాప్​​ ద్వారా కోల్​కతాలోని ఫేమస్​ 'జామ్​ జామ్​ రెస్టారెంట్'​ నుంచి బిర్యానీ, కబాబ్స్, చాప్​ వంటి వాటిని ఆర్డర్​ చేశారు. ఈ మేరకు 'జామ్​ జామ్​ రెస్టారెంట్' డైరెక్టర్ షద్మాన్​ ఫైజ్​ ద్వారా బయపడింది. అయితే ఆ ఆర్డర్ పాకిస్థాన్ ఆటగాళ్ల నుంచి వచ్చిందనే విషయం మొదటి తమకు తెలియదని.. ఆ తర్వాత తెలిసిందని షద్మాన్ చెప్పారు. కోల్​కతా బిర్యానీ ప్రత్యేకంగా ఉంటుందని.. ప్రపంచవ్యాప్తంగా అది ఫేమస్ అని చెప్పారు. ఇలా పాక్​ క్రికెటర్లు తమ రెస్టారెంట్​ నుంచి ఆర్డర్​ చేయడం చాలా సంతోషంగా ఉందని షద్మాన్ తెలిపారు.

'మా ప్లేయర్లు రోజుకు 8 కిలోల మాంసం తింటున్నారు'
అయితే, ఇంతకుముందు పాకిస్థాన్ ఆటగాళ్ల ఆహార అలవాట్లు, ఫిట్‍నెస్‍పై పాక్​ మాజీ పేసర్ వసీం అక్రమ్ సహా పలువురు విమర్శలు గుప్పించారు. అఫ్గానిస్థాన్​ చేతిలో పాక్​ ఓడిపోయిన తర్వాత ఓ స్పోర్ట్స్​ ఛానల్​​లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'మా ఆటగాళ్ల ఫిట్‌నెస్ లెవెల్స్ చూడండి. గత రెండేళ్లుగా ఫిట్‌నెస్ టెస్టులు చేయలేదని మేము కొన్నాళ్లుగా చెబుతున్నాం. చూస్తుంటే వారు (పాకిస్థాన్ ప్లేయర్లు) ప్రతిరోజు 8 కిలోల మాంసం తింటున్నట్లు కనిపిస్తోంది. ఏదో ఒక పరీక్ష జరగాలి. మీ దేశం కోసం ఆడినందుకు మీకు డబ్బు చెల్లిస్తున్నారు. కాబట్టి ఒక నిర్దిష్ట ప్రమాణం ఉండాలి' అని ఆటగాళ్ల ఫిట్​నెస్​పై​ వసీం అక్రమ్ అసహనం వ్యక్తం చేశారు.

Babar Azam Chat Leak : వివాదాల్లో చిక్కుకున్న బాబర్ అజామ్​.. అండగా పాక్​ మాజీ కెప్టెన్!

Sheetal Devi Archery : చేతులు లేకున్నా సడలని విశ్వాసం.. రెండు స్వర్ణాలు, ఓ రజతంతో ఎందరికో స్ఫూర్తిగా..

Last Updated :Oct 31, 2023, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.