ETV Bharat / sports

ODI World Cup 2023 Afghanistan Records : పాకిస్థాన్​పై అద్భుత విజయం.. అఫ్గాన్ నమోదు చేసిన​ 8 రికార్డులివే

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 11:14 AM IST

ODI World Cup 2023 Afghanistan Records : పాకిస్థాన్​పై సంచలనం విజయంతో.. అఫ్గాన్ నమోదు చేసిన​ రికార్డులు
ODI World Cup 2023 Afghanistan Records : పాకిస్థాన్​పై సంచలనం విజయంతో.. అఫ్గాన్ నమోదు చేసిన​ రికార్డులు

ODI World Cup 2023 Afghanistan Records : చెన్నై వేదికగా సోమవారం పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో అఫ్గానిస్థాన్ సంచలన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్​తో వన్డే ప్రపంచకప్​ చరిత్రలోనే అఫ్గాన్​ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. వీటితో పాటు అఫ్గాన్​ నమోదు చేసిన మరికొన్ని రికార్డుల గురించి తెలుసుకుందాం.

ODI World Cup 2023 Afghanistan Records : ప్రపంచకప్​ 2023లో అఫ్గానిస్థాన్ సంచలన విజయాలను నమోదు చేస్తోంది. డిఫెండింగ్​ ఛాంపియన్ ఇంగ్లాండ్​ను ఓడించి పెను సంచనలమే సృష్టించింది. ఆ విజయం గురించి క్రికెట్​ అభిమానులు ఇంకా మాట్లాడుకోవటం మానలేదు. అంతలోనే మరో సంచలన విజయం సాధించింది. తాజాగా పాకిస్థాన్​ను ఊహించని విధంగా చిత్తు చేసింది. అఫ్గాన్​ ప్లేయర్లు మరీ అంత సులవుగా ఇంగ్లాండ్​, పాకిస్థాన్ లాంటి జట్లను ఓడించేస్తుందని ఎవరూ అనుకోని ఉండరు. అయితే సోమవారం పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించిన అఫ్గానిస్థాన్​ కొన్ని రికార్డులను నమోదు చేసుకుంది.

  • అప్గానిస్థాన్​ వన్డే ప్రపంచకప్​ టోర్నీల్లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. గతంలో 2015లో స్కాట్లాండ్​ను ఓడించింది. ఈ ప్రపంచకప్​లో డిఫెండింగ్​ ఛాంపియన్ ఇంగ్లాండ్​ను మట్టికరింపించిన అఫ్గాన్​ ఇప్పుడు పాక్​ను చిత్తు చేసింది.
  • వన్డేల్లో పాకిస్థాన్​పై అఫ్గానిస్థాన్​కి ఇదే తొలి విజయం. ఇప్పటి వరకు పాకిస్థాన్​తో మొత్తం ఎనిమిది మ్యాచ్​ల్లో అఫ్గాన్​ తలపడగా... పాక్​ ఏడు మ్యాచ్​ల్లో విజయం సాధించింది. అఫ్గాన్​ మాత్రం తొలిసారి గెలిచింది.
  • వరల్డ్​ కప్​ టోర్నీల్లో అఫ్గాన్​ చేసిన అత్యధిక స్కోర్ల జాబితాలో ఈ మ్యాచ్​ రెండోది. అంతకుముందు 2019 ప్రపంచకప్​లో వెస్టిండీస్​పై 288 పరుగులు చేసింది. ఇప్పుడు పాక్​పై 286 రన్స్ చేసింది.
  • వన్డేల్లో అత్యధిక లక్ష్య ఛేదనను మాత్రం అఫ్గాన్‌ ఇప్పుడే చేసింది. ఈ మ్యాచ్‌ ముందు వరకు.. యూఏఈపై 2014లో 274 పరుగులను ఛేదించి అఫ్గాన్ విజయం సాధించింది. ఇక వరల్డ్‌ కప్‌లో పాక్‌పై అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగానూ అఫ్గాన్‌ నిలిచింది.
  • వన్డే వరల్డకప్​లో ఒకే మ్యాచ్‌లో స్పిన్నర్లతో అత్యధిక ఓవర్లు వేయించిన మ్యాచ్​ల్లో ఇది మూడోది. 2019లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో 60 ఓవర్లు వేయగా.. ఇప్పుడు 59 ఓవర్లు వేశారు. అంతకుముందు 2011లో భారత్- ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్​లో 59 ఓవర్లు స్పిన్నర్లే వేశారు.
  • ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ స్పిన్నర్లు 38 ఓవర్లు వేసి 176 పరుగులకు 4 వికెట్లు తీశారు. పాక్‌ స్పిన్నర్లు మాత్రం 21 ఓవర్లు వేసి 131 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయారు.
  • వన్డే ప్రపంచకప్‌ల్లో అఫ్గానిస్థాన్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రహ్మత్‌ షా (404) నిలిచాడు. ఆ తరువాత హష్మతుల్లా షాహిది (365), నజ్ముల్లా జాద్రాన్ (360) ఉన్నారు.
  • పాకిస్థాన్‌ వన్డే ప్రపంచకప్‌ పోటీల్లో 275+ టార్గెట్‌ను కాపాడుకోలేకపోవడం ఇదే తొలిసారి. మొత్తం 14 మ్యాచుల్లో 13 మ్యాచుల్లో గెలవగా.. ఈసారి మాత్రం ఓటమిని చవిచూసింది.

ODI World Cup 2023 Afghanisthan : అప్గాన్ సంచలన విజయాల​ వెనక కన్నీటి గాథలు.. ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర

ODI World Cup 2023 PAK VS AFG : చరిత్ర సృష్టించిన అప్గానిస్థాన్.. పాకిస్థాన్​పై​​ సంచలన విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.