ETV Bharat / sports

Babar Azam Chat Leak : వివాదాల్లో చిక్కుకున్న బాబర్ అజామ్​.. అండగా పాక్​ మాజీ కెప్టెన్!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 3:39 PM IST

Updated : Oct 31, 2023, 3:49 PM IST

Babar Azam Chat Leak : పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. 2023 వరల్డ్​ కప్​లో టీమ్​ పేలవ ప్రదర్శన, వాట్సాప్ చాట్​ లీక్​ వంటి ఘటనలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇలా వివాదాల్లో చిక్కుకుంటున్న బాబర్​కు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అండగా నిలిచాడు.

Babar Azam Chat Leak
బాబర్ అజామ్ వాట్సాప్ చాట్ లీక్

Babar Azam Chat Leak : 2023 వరల్డ్​ కప్​లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న పాకిస్థాన్​ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. సోమవారం ఆ జట్టు చీఫ్​ సెలెక్టర్ ఇంజమామ్​ ఉల్​ హక్ అవినీతి ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు పాకిస్థాన్​ కెప్టెన్ బాబర్​ అజామ్ కూడా తన ఆటతీరుతోనే కాకుండా.. బయట కూడా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఈ వరల్డ్​ కప్ మెగాటోర్నీలో టీమ్​ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్ అజామ్​ కాల్‌ చేస్తే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు- పీసీబీ ఛైర్మన్‌ స్పందించకపోవడం.. ఆపై అతడి చాట్స్‌ లీకేజీ వంటి ఘటనలతో వివాదాల్లో నిలిచాడు. ఈ వివాదాల్లో చిక్కుకున్న బాబర్‌కు అండగా పాక్​ మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిది నిలిచాడు.

Babar Chat Leaked Screenshot : ఇటీవల పాకిస్థాన్ క్రికెట్​లో జరుగుతున్న పరిణామాలపై ఓ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా షాహిద్ అఫ్రిది స్పందించాడు. 'నేను ఒకటే చెబుతాను.. ఇది చాలా చాలా చెత్తపని. ఎవరివైనా వ్యక్తిగత మెసేజ్‌లను టీవీలో ఎలా ప్రసారం చేస్తారు. అది కూడా మన జట్టు సారథి మెసేజ్‌లా..? మన ప్లేయర్లనే మనం ఇంతలా అవమానిస్తున్నాం. ఈ పని పీసీబీ ఛైర్మన్‌ చేసినా అది తప్పే. అతడికి అజామ్​తో అభిప్రాయభేదాలున్నాయని రషీద్‌ లతీఫ్‌ చెబుతున్నాడు. అందుకే బాబర్‌ కాల్‌ చేసినా అతడు సమాధానం చెప్పలేదంటున్నారు. ఈ లీకేజీ వ్యవహారాన్ని షోయబ్‌ బయటకు తెచ్చినట్లు నేను భావిస్తున్నాను. అతడు ఇలా ఎందుకు చేశాడు. ఛైర్మన్‌ అతడిని ఇలా చేయమని చెప్పారా..? ఒక వేళ ఛైర్మన్‌ చెప్పినా ఇది చాలా చెత్తపని' అని అఫ్రిది ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఇదీ జరిగింది..
Babar Azam Chat Photo : అయితే ఇటీవల బాబర్‌ అజామ్‌, పీసీబీ చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్ మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌ లీక్‌ అయింది. దీన్ని పీసీబీ చీఫ్ జకా అష్రఫ్‌ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అయితే అతడే ఈ చాట్‌ని లీక్‌ చేశాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై పాక్ మాజీ క్రికెటర్‌ వకార్‌ యూనిస్‌ కూడా బాబర్‌కు మద్దతుగా నిలిచాడు. బాబర్‌ను దయచేసి వదిలేయండని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు వకార్‌ యూనిస్ సోషల్ మీడిడా వేదిక ఎక్స్​లో ట్వీట్‌ చేశాడు.

Inzamam Ul Haq Resignation : పాకిస్థాన్​ క్రికెట్​కు మరో ఎదురుదెబ్బ.. జట్టు చీఫ్​ సెలెక్టర్ రాజీనామా

World Cup 2023 Afghanistan : అఫ్గాన్ సంచలన హ్యాట్రిక్​ ​.. సెమీస్​కు ఛాన్స్​ ఎలాగంటే?

Last Updated : Oct 31, 2023, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.