ETV Bharat / sports

Inzamam Ul Haq Resignation : పాకిస్థాన్​ క్రికెట్​కు మరో ఎదురుదెబ్బ.. జట్టు చీఫ్​ సెలెక్టర్ రాజీనామా

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 8:37 PM IST

Updated : Oct 30, 2023, 10:41 PM IST

Inzamam Ul Haq Resignation : 2023 వన్డే వరల్డ్ కప్​లో వరుసగా విఫలం అవుతున్న పాకిస్థాన్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు చీఫ్​ సెలెక్టర్ ఇంజమామ్​ ఉల్​-హక్ తన పదవికి రాజీనామా చేశారు.

Inzamam Ul Haq Resignation
Inzamam Ul Haq Resignation

Inzamam Ul Haq Resignation : పాకిస్థాన్ పురుషుల​ క్రికెట్ టీమ్​ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ (చీఫ్​ సెలెక్టర్) ఇంజమామ్​ ఉల్​ హక్​ తన పదవికి రాజీనామా చేశారు. మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇంజమామ్​ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు సోమవారం సోషల్​ మీడియా ఫ్లాట్​ఫామ్​ ఎక్స్ వేదికగా వెల్లడించింది. భారత్​లో జరుగుతున్న 2023 వన్డే ప్రపంచ కప్​లో పాకిస్థాన్​ వరుసగా విఫలం అవుతున్న నేపథ్యంలో తాజా పరిణామంతో ఆ టీమ్​కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

"మీడియాలో పరస్పర విరుద్ధ ఆరోపణలు లేవనెత్తారు. ఆ ఆరోపణలపై పారదర్శకంగా విచారణ జరిపేందుకు పీసీబీకి అవకాశం కల్పించడానికి నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను. కమిటీ నన్ను నిర్దోషిగా తేల్చితే.. మళ్లీ చీఫ్​ సెలెక్టర్​గా నా పాత్రను తిరిగి కొనసాగిస్తాను"
--ఇంజమామ్​ ఉల్​ హక్, పీసీబీ మాజీ ఛైర్మన్

  • Inzamam-ul-Haq has resigned as the chairman of the national men's selection committee and junior selection committee. He was appointed as the chairman of the national men's committee on 7 August 2023 and was also appointed chairman of the junior men's selection committee earlier…

    — PCB Media (@TheRealPCBMedia) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ జరిగింది..
Inzamam Ul Haq Allegations : యజో ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ ప్లేయర్స్‌ ఏజెన్సీలో ఇంజమామ్‌ వాటాదారుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ జట్టులోని ప్రధాన ఆటగాళ్లు బాబర్ అజామ్‌, మహ్మద్ రిజ్వాన్, షాహీన్‌ అఫ్రిది మరికొంతమంది ప్లేయర్స్‌కు ఈ సంస్థతో అనుబంధం ఉంది. దీంతో ఇంజమామ్‌ ఉల్‌ హక్‌కు అనుకూలంగా ఉండే ఆటగాళ్లనే ప్రపంచకప్‌కు ఎంపిక చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంజమామ్​పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టడానికి పీసీబీ ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. అంతకుముందు ఈ విషయంపై స్పందించిన ఇంజమామ్.. కొంతమంది వ్యక్తులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని.. ఆ ఆరోపణలపై నిజనిజాలు తెలుసుకోవాలని అన్నారు. ఈ అంశంపై పీసీబీ విచారణ చేయాలని.. తనకు ప్లేయర్ ఏజెంట్‌ కంపెనీతో ఏ సంబంధమూ లేదు అని పేర్కొన్నారు. కాగా ఇంజమాన్​ 2023 ఆగస్టు 7న పురుషుల జట్టుకు చీఫ్​ సెలెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ నెల ప్రారంభంలో జూనియర్​ మెన్స్​ జట్టు సెలెక్షన్ కమిటీకి ఛైర్మన్​గా నియామకమయ్యారు.

  • Pakistan Cricket Board (PCB) has set up a five-member fact-finding committee to investigate allegations in respect of conflict of interest reported in the media pertaining to the team selection process.

    The committee will submit its report and any recommendations to the PCB…

    — PCB Media (@TheRealPCBMedia) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Shami World Cup Wickets : సూపర్​ ఫామ్​లో షమీ.. అరుదైన రికార్డుకు అడుగు దూరంలో..

SL vs AFG World Cup 2023 : శ్రీలంకపై అఫ్గాన్ ఘన విజయం.. వరల్డ్​ కప్​లో ముచ్చటగా మూడో గెలుపు

Last Updated : Oct 30, 2023, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.