ETV Bharat / sports

24 ఏళ్ల తర్వాత పాక్​లో ఆస్ట్రేలియా​.. మ్యాచ్​ల షెడ్యూల్ రిలీజ్

author img

By

Published : Feb 4, 2022, 6:28 PM IST

Updated : Feb 4, 2022, 6:40 PM IST

Pakistan Cricket News
పాకిస్థాన్​తో సిరీస్

Pakistan Cricket News: పాకిస్థాన్​ తన సొంతగడ్డపై బడా జట్లతో క్రికెట్​ ఆడించాలని గత దశాబ్దకాలం నుంచి కలలు కంటోంది. 2009 ఘటన తర్వాత ఏ పెద్ద జట్టూ పాక్​ గడ్డపై అడుగుపెట్టడానికి ఆసక్తి చూపలేదు. వచ్చినా.. ఆడకుండానే తిరుగు ప్రయాణం కట్టాయి. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా పాక్​లో పర్యటించేందుకు అంగీకరించింది. మ్యాచ్​ల షెడ్యూల్​ కూడా రిలీజ్ చేసింది.

Pakistan Cricket News: సొంతగడ్డపై పెద్ద జట్లతో అంతర్జాతీయ క్రికెట్​ సిరీస్​లు నిర్వహించాలనే పాకిస్థాన్​ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించినట్లున్నాయి. గతేడాది న్యూజిలాండ్​, ఇంగ్లాండ్​ వంటి జట్లు తొలుత ఒప్పుకొని, చివరి క్షణంలో భద్రతా లోపాలను కారణాలుగా చూపుతూ రద్దు చేసుకున్నాయి. మరికొన్ని గంటల్లో మ్యాచ్​ ఉంది అనగా కివీస్​ జట్టు తిరుగు ప్రయాణమై పాక్​కు షాక్​ ఇచ్చింది. అయితే క్రికెట్​ ఆస్ట్రేలియా తమ జట్టును పాక్​లో పర్యటించేందుకు ఆమోదం తెలిపి, ఆతిథ్య జట్టుకు ఆనందపరిచింది. షెడ్యూల్​ కూడా రిలీజ్ చేసింది.

24 ఏళ్ల తర్వాత మళ్లీ..

భారత్​, ఇంగ్లాండ్​, న్యూజిలాండ్​ వంటి జట్లు పాకిస్థాన్​లో ఆడి దశాబ్దకాలానికిపైగా అయింది. కానీ కంగారూలు పాక్​ గడ్డపై అడుగుపెట్టి అంతకన్నా ఎక్కువ కాలమే అయింది. 24 ఏళ్ల క్రితం ఆసీస్​ పాకిస్థాన్​లో పర్యటించింది. సుదీర్ఘ కాలం ఆసీస్​ తమ గడ్డపై ఆడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది పాక్​ క్రికెట్​ బోర్డు.

తమ దేశంలో ఆస్ట్రేలియా పర్యటించడంపై పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు హర్షం వ్యక్తం చేసింది. ఆసీస్​కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపింది.

పాక్​ జట్టుతో కంగారూలు మూడు టెస్టులు, మూడు వన్డేలు సహా ఓ టీ20లో తలపడనున్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్​ 5 మధ్య ఈ మ్యాచ్​లు జరుగుతాయి. ​

మ్యాచ్​ తేదీలు ఇవే..

  • తొలిటెస్టు - మార్చి 4 నుంచి 8 - రావల్పిండి
  • రెండో టెస్టు - మార్చి 12 నుంచి 16 - కరాచీ
  • మూడో టెస్టు - మార్చి 21 నుంచి 25 - లాహోర్
  • మొదటి వన్డే - మార్చి 29 - రావల్పిండి
  • రెండో వన్డే - మార్చి 31- రావల్పిండి
  • మూడో వన్డే - ఏప్రిల్ 2 - రావల్పిండి
  • టీ20 - ఏప్రిల్​ 5 - రావల్పిండి

ఈసారైనా..?

అంతర్జాతీయంగా పాక్​ జట్టు మంచి ప్రదర్శలు ఇస్తున్నా.. ఆ జట్టు సొంతగడ్డలో పర్యటించేందుకు బడా జట్లు సంకోచిస్తున్నాయి. గతేడాది న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల యాజమాన్యం ప్రదర్శించిన వైఖరి అందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఆసీస్​ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈసారైనా సొంతగడ్డపై బడా జట్లతో సిరీస్​ నిర్వహించాలన్న పాక్​ కల నెలవేరుతుందా?

ఇదీ చూడండి : పాక్​​ పేసర్​ బౌలింగ్​పై నిషేధం- కారణం ఇదే..

Last Updated :Feb 4, 2022, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.