ETV Bharat / sports

పాక్​​ పేసర్​ బౌలింగ్​పై నిషేధం- కారణం ఇదే..

author img

By

Published : Feb 4, 2022, 1:33 PM IST

Pakistan pacer Hasnain suspension: పాకిస్థాన్​ బౌలర్​ మొహమ్మద్​ హస్నైన్​కు షాక్​ ఇచ్చింది ఆ దేశ క్రికెట్​ బోర్డు. అతని బౌలింగ్​ యాక్షన్​ సరిగా లేదని ఈ నిర్ణయం తీసుకుంది.

Pakistan pacer Hasnain suspended
పాకిస్థాన్​ పేసర్​పై ఐసీసీ నిషేధం

Pakistan pacer Hasnain suspension: పాకిస్థాన్​ యువ పేసర్​ మొహమ్మద్​ హస్నైన్​ను అంతర్జాతీయ క్రికెట్​లో బౌలింగ్​ వేయకుండా నిషేధించింది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ). అక్రమ బౌలింగ్ యాక్షన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం తెలిపింది.

ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్​బాష్​ లీగ్​లో హస్నైన్​​ బౌలింగ్ యాక్షన్​పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అంపైర్లు ఫిర్యాదు చేశారు. దీంతో లాహోర్​లో అతనికి బౌలింగ్​ పరీక్షలు నిర్వహించారు. వాటిలో అక్రమ బౌలింగ్​ వేస్తున్నాడని తేలడంతో సస్పెండ్​ చేస్తూ నిర్ణయం తీసుకుంది పీసీబీ.

తదుపరి పరీక్షల్లో హస్నైన్​​ నెగ్గేంత వరకు సస్పెన్షన్​ అమలులో ఉంటుందని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు స్పష్టం చేసింది. 21 ఏళ్ల ఈ పాక్​ పేసర్​.. ఆ జట్టు తరఫున ఇప్పటి వరకు 8 వన్డేలు, 18 టీ ట్వంటీలు ఆడాడు. 29 వికెట్లు తీశాడు.

ఇదీ చూడండి: యాషెస్​ పరాభవం.. ఇంగ్లాండ్​ హెడ్​కోచ్​పై వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.