ETV Bharat / sports

సచిన్​ వర్సెస్​ యూవీ : అన్న బౌలింగ్‌లో సిక్సర్​ బాది తమ్ముడు విజయం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 7:59 PM IST

One World One Family Cup‌లో భాగంగా జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దిగ్గజ క్రికెటర్లందరూ కలిసి ఈ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్​లో అన్న వేసిన ఆఖరి ఓవర్‌లో తమ్ముడు సిక్స్ బాది తన జట్టును గెలిపించుకోవడం విశేషం. ఆ వెంటనే తనను క్షమించాలంటూ అన్నను హత్తుకున్నాడు.

యూవీ సేనపై సచిన్ టీమ్ విజయం
యూవీ సేనపై సచిన్ టీమ్ విజయం

One World One Family Cup 2024 : దిగ్గజ క్రికెటర్లంతా రెండు జట్లుగా విడిపోయి వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ టీమ్ పేరిట ఓ టీ20 ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. 'ఒకే ప్రపంచం - ఒకే కుటుంబం' అనే నినాదాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ ఫ్రెండ్లీ మ్యాచ్​ను నిర్వహించారు. వీరిలో భారత్​ సహా ఇతర దేశాలకు చెందిన క్రికెట్‌ దిగ్గజాలు ఉన్నారు. బెంగళూరులోని సాయి క్రిష్ణన్ క్రికెట్ అకాడమీలో ఈ మ్యాచ్ జరిగింది. వన్ వరల్డ్​ టీమ్‌కు సచిన్​ తెందుల్కర్​ కెప్టెన్‌గా వ్యవహరించగా వన్ ఫ్యామిలీ జట్టుకు దిగ్గజ ఆల్‌రౌండర్ యవరాజ్ సింగ్​ సారథ్యం వహించాడు. అయితే ఈ మ్యాచ్​లో పఠాన్ బ్రదర్స్ విషయంలో ఓ ఆసక్తికర విషయం జరిగింది. అన్న వేసిన ఆఖరి ఓవర్‌లో తమ్ముడు సిక్స్ బాది తన జట్టును గెలిపించుకోవడం విశేషం. ఆ వెంటనే తనను క్షమించాలంటూ తన అన్నను హత్తుకున్నాడు.

మొదట బ్యాటింగ్‌ చేసిన వన్‌ ఫ్యామిలీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఇంగ్లాండ్​ ప్లేయర్​ డారెన్‌ మ్యాడీ(51) హాఫ్​ సెంచరీతో రాణించగా లంక మాజీ వికెట్‌ కీపర్‌ కలువితరణ 22, టీమ్​ఇండియా మాజీ ప్లేయర్స్​ యూసఫ్‌ పఠాన్‌ 38, యువరాజ్‌ సింగ్‌(10 బంతుల్లో 23) రన్స్​ చేశారు. వన్‌ వరల్డ్‌ బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌ 2 వికెట్లు తీయగా సచిన్‌, ఆర్పీ సింగ్‌, అశోక్‌ దిండా, మాంటీ పనేసర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అన్న బౌలింగ్‌లో సిక్సర్​ బాది గెలుపు : 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వన్​ వరల్డ్​ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. అల్విరో పీటర్సన్‌(74), సచిన్​ తెందుల్కర్​(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 27), నమన్‌ ఓఝా(25), ఉపుల్‌ తరంగ (29) రాణించారు. దీంతో విజయం వన్ వరల్డ్​ జట్టుకు వరించింది. యూసఫ్‌ పఠాన్‌ బౌలింగ్‌లో అతడి సోదరుడు ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి సిక్సర్‌ బాది తన జట్టును విజయాన్ని అందించాడు. వన్‌ ఫ్యామిలీ బౌలర్లలో చమింద వాస్‌ 3 వికెట్లు తీయగా ముత్తయ్య మురళీథరన్‌, యువరాజ్‌ సింగ్‌, జేసన్‌ క్రేజా తలో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ క్రికెట్‌ దిగ్గజాలు కలిసి ఆడడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ ఓవర్​లో స్పిన్నర్ల మ్యాజిక్- పేసర్ల కంటే వీళ్లే డెంజర్

సచిన్ 'డీప్​ ఫేక్'​ వీడియో - ఆ కంపెనీ యజమానిపై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.